ఈ మద్య మనుషుల్లో మానవత్వపు విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి. అమ్మ అంటే.. ఆత్మీయత, తీయదనం, నమ్మకం.. ఒక్కటేమిటి అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే. కంటికి రెప్పలా చూసుకుంటుంది.. తన పిల్లల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయదు.
ఈ మద్య కొంత మంది తల్లి అనే పదానికి మచ్చతెస్తున్నారు. కొంత మంది పెళ్లి కాకుండానే తల్లులు కావడంతో పుట్టిన పిల్లలను చెత్త కుప్పల్లో, మురికి కాల్వల్లో, నిర్జీవ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారిని బతికుండగానే పొలంలో పాతిపెట్టిన దారుణమైన ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ గంభోయ్ గ్రామంలో ఓ వ్యక్తి తన పొలాన్ని చూసుకుంటున్నాడు. అదే సమయంలో తన పొలంలో ఎవరో తవ్వినట్లు కనిపించింది. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే.. ఒక చిన్నారి చేయి పైకి తేలి కనిపించింది. మొదట షాక్ తిన్న ఆ వ్యక్తి పక్కనే పవర్ స్టేషన్‌లో పని చేస్తున్న వాళ్లను పిలిచాడు. వారి సహాయంతో అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా, ఒక శిశువు కనిపించింది. అయితే ఆ చిన్నారి అప్పటికీ ప్రాణాలతో ఉండటంతో వెంటనే.. అధికారులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న అధికారులు పొలం వద్దకు వచ్చి అంబులెన్స్‌లో చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇది అత్యంత హేయమైన ఘటన అని.. బతికి ఉన్నపుడే ఆ చిన్నారిని ఎలా పూడ్చిపెట్టారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నింధితులు ఎవరైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, చిన్నారి విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.