గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పెళ్లైన మహిళపై కొందరు యువకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లిన ఆ దుర్మార్గులు ఆ మహిళపై కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అహ్మదాబాద్ మేఘానీనగర్ లోని నరోడా ప్రాంతంలో మధుబేన్ దామోదర్ (32) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇది వరకే పెళ్లైంది. ఆ మహిళ భర్త, ఆమె సోదరుడు ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ స్థానికంగా ఉండే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి ఈ మహిళ అందంగా ఉండడంతో ఓ యువకుడు మధుబేన్ ని వేధించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆ యువతి ఆ యువకుడితో అనేకసార్లు గొడవ కూడా పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 30న సోదరుడు, ఆమె భర్త పనికి వెళ్లడంతో ఇంట్లో మధుబేన్ దామోదర్ ఒంటరిగా ఉంది. ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న కొందరు యువకులు ఆ మహిళ ఇంట్లోకి వెళ్లారు. అనంతరం మధుబేన్ గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అనంతరం ఆమె శవాన్ని ఎవరికి కనిపించకుండా స్థానికంగా ఓ చోట పడేశారు.
ఇక సాయంత్రం భర్త, సోదరుడు పని నుంచి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో భార్య మధుబేన్ దామోదర్ కనిపించలేదు. దీంతో ఖంగారుగా అటు ఇటు వెతికే సరికి ఓ చోట మధుబేన్ దామోదర్ పడిపోయి కనిపించింది. వెంటనే ఆమె భర్త, సోదరుడు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందంటూ నిర్దారణకు వచ్చారు. భార్య మరణించడంతో ఆమె భర్త, సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత మధుబేన్ దామోదర్ సోదరుడు, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది.