గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. దేశ సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్)లో పని చేస్తున్న ఓ ఆర్మీ జవాన్ ను కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. దేశ సరిహద్దుల్లో కాపలాగా ఉంటున్న ఓ ఆర్మీ జవాన్ ను అంతలా ఎందుకు కొట్టి చంపారు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. గుజరాత్‌లోని నదియాడ్ పరిధిలోని చక్లాసి గ్రామం. ఇదే గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.
ఇతని కూతురు స్థానికంగా ఓ ఉండే స్కూల్ లో చదువుకుంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల యువకుడు ఆ బాలికకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే వాళ్లిద్దరూ తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆ యువకుడు ఆ బాలిక అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తండ్రి ఆర్మీ జవాన్ కోపంతో ఊగిపోయాడు. ఇక శనివారం ఆ బాలుడు ఇంటికి వెళ్లిన ఆర్మీ జవాన్.. ఎందుకు నా కూతురు అసభ్యకరమైన వీడియోను పోస్ట్ చేశావని ఆ బాలుడిని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆర్మీ జవాన్ పై ఎదురు దాడికి దిగారు. ఇక మాటా మాటా పెరిగిపోవడంతో ఆ 15 ఏళ్ల బాలుడు ఆర్మీ జవాన్ పై దాడికి దిగాడు.
ఆర్మీ జవాన్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అతడు మరణించడంతో ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అనంతరం దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులుపై ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రశ్నించినందుకు అన్యాయంగా ఓ ఆర్మీ జవాన్ ను కొట్టి చంపిన ఈ దారుణ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.