ఈ మధ్యకాలంలో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు రోజుకు రోజుకు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు భరించలేక ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. ఇక ఇదే కాకుండా వడ్డీ వ్యాపారులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బారు వడ్డీ, చక్రవడ్డీలు అంటూ సామాన్యులను మానసికంగా హింసిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వడ్డీ వ్యాపారీ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాజ్ కోట్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గతంతో ఇతనికి డబ్బులు అవసరముంటే స్థానికంగా ఉండే వడ్డీ వ్యాపారీ అయిన అజిత్ సింగ్ వద్ద సుమారు రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇక తీసుకున్న మొత్తానికి ఆ ఆటో డ్రైవర్ నెల నెల అజిత్ సింగ్ కు వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి అతని పరిస్థితి బాగలేకపోవడంతో కొన్ని నెలల నుంచి వడ్డీ డబ్బులు చెల్లించడం లేదు. దీంతో వడ్డీ అజిత్ సింగ్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. నెల నెల ఖచ్చితంగా చెల్లించాల్సిందేనంటూ అతనిపై ఆగ్రహానికి లోనయ్యాడు. అలా కొంత కాలం పాటు వడ్డీ వ్యాపారీ అజిత్ సింగ్ దారుణంగా దూషిస్తూ వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడేవాడు.
ఇక ఇంతటితో ఆగని ఆ వడ్డీ వ్యాపారీ అతనిపై భార్యపై కన్నేశాడు. నువ్వు వడ్డీ చెల్లించకపోతే నీ భార్యను నాతో పడుకోమని చెప్పు అంటూ దారుణంగా ప్రవర్తించాడు. ఇదే కాకుండా వడ్డీ వ్యాపారీ అజిత్ సింగ్ మొత్తానికి ఆ ఆటో డ్రైవర్ భార్యను కన్నేసి, బెదిరించి ఆమెతో శారీరకంగా కోరిక తీర్చుకున్నాడు. నెల నెల డబ్బులు చెల్లించకుంటే నీ భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి ఆమెతో కోరికలు తీర్చుకున్నాడు. ఇక ఇతని ఆగడాలను భరించలేని ఆ దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.