పెళ్లై పిల్లలు కలిగిన కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు జై కొడుతున్నారు. ఇంకొందరైతే ఈ చీకటి కాపురానికి ఎవరూ అడ్డొచ్చినా అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. కానీ ఓ మహిళ సొంత మరిదిపై మనసుపారేసుకుని అక్రమ సంబంధాన్ని నడిపిస్తుంది. ప్రియుడితో ఈ వ్యవహారం నడిపించుకునేందుకు సొంత చెల్లినే ఎరగా వేసింది. ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ లోని మణినగర్ లో నివాసం ఉంటోన్న మహిళకు ఓ వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే రోజులు మారుతున్న కొద్ది భార్య ప్రవర్తనలో మార్పొచ్చి ఏకంగా సొంత మరిదిపై మనసుపారేసుకుంది. దీంతో అతనితోనే అక్రమసంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే మరిదికి అత్తింటివాళ్లు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. దీంతో ప్లాన్ ప్రకారం మరో మహిళ వస్తే నా బండారం బయటపడుతుందేమోనని తన సొంత చెల్లినే మరిదికి ఇచ్చి పెళ్లి చేయించింది.
ఇది కూడా చదవండి: భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. కారణం ఏంటంటే?
పెళ్లైన కొన్నాళ్లకి వీరిద్దరి వ్యవహారం చెల్లికి తెలిసిపోయింది. దీంతో బయటపెడితే ఎక్కడ పరువుపోతుందోనని కొన్నాళ్లపాటు ఆగి ఏకంగా బావకు కూడా చెప్పింది. ఆయన వాళ్ల కూడా వీరిద్దరి వ్యవహారానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఎంతకూ వారిద్దరి తీరు మారకపోవడంతో చెల్లెలు అభయం హెల్ప్ లైన్ కు కాల్ చేసి జరిగిందంతా వివరించింది. ఈ ఘటనపై స్పందించిన అభయం అధికారులు ఈ కేసులో కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరమని తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.