వీళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. దీంతో వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. ఈ దంపతులు తమ తలలను తామే నరుక్కున్నారు. తాజాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
గుజరాత్ తో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. దాని కోసం ఆ దంపతులు ఏకంగా తమ తలలను తామే నరుక్కున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనతో మృతుల ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ దంపతులు ఎందుకు తమ తలలను తామే నరుక్కున్నారు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా వించియా ప్రాంతంలో హేము మక్వానా (38), హన్సా మక్వానా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు (13), కుమారుడు (12) జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఆ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా జీవించారు. అయితే ఈ దంపతులకు తాంత్రిక పూజలపై విశ్వసం ఉండేది. దీంతో వీరు ఏడాది కాలంగా పూజలు చేస్తున్నారు. ఇకపోతే ఈ దంపతులు ఇటీవల మరోసారి తాంత్రిక పూజలు చేయాలని అనుకున్నారు. కానీ, ఈ సారి ఎవరూ ఊహించని రీతిలో పూజలకు తెరలేపారు. తాంత్రిక పూజల్లో భాగంగానే ఆ దంపతులు తమ తలలను తాము నరుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇకపోతే.. గత శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ దంపతులు తమ పొలంలో తాంత్రిక పూజలు చేశారు. ముందుగా వీరి తలలను నరుక్కునేందుకు మేక్-షిఫ్ట్ గిలెటిన్ అనే మిషన్ ను ఉపయోగించారు. దానికి తాడు కట్టి అందులో వీరి తలలను ఉంచారు. అందులో పెట్టగానే ఆ దంపతుల తలల తెగి వారు ఏర్పాటు చేసుకున్న హోంలో పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మృతుల కుటుంబ సభ్యులను, పిల్లలను కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాంత్రిక పూజల నెపంతో తమ తలలను తామే నరుక్కున్న ఈ దంపతుల చర్యపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.