బ్రేకప్ తర్వాత కూడా ప్రేయసిని మళ్లీ కలవాలని భావిస్తుంటాడు ప్రియుడు. ప్రియురాలు మనస్సు కరగకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ కొన్ని సార్లు.. అనాలోచితమైన ఆలోచనలు చేసి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొంత మంది ప్రేమికులు.
ప్రేమలో అలకలు, గొడవలు, కోప తాపాలు కామన్. కానీ ఆ గొడవలు ఎక్కువైతే మాత్రం బ్రేకప్‌కు దారి తీస్తాయి. అయితే ఈ బ్రేకప్ సమయాల్లో కూడా ప్రేమించిన వ్యక్తులను విడిచి ఉండలేక.. మళ్లీ కలిసిపోయే వారు కొందరైతే. ఇంకా ఎప్పటికీ కలవకూడదని..నిర్ణయించుకుంటారు. దాన్నే అనుసరించేవారున్నారు. బ్రేకప్ తర్వాత కూడా ప్రియురాలి వెంటపడుతూ వేధిస్తుంటారు మరి కొంత మంది. తమతో మళ్లీ కలవాలని బ్రతిమాలుకుంటారు. ప్రియురాలు మనస్సు కరగకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ కొన్ని సార్లు.. అనాలోచితమైన ఆలోచనలు చేసి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొంత మంది ప్రేమికులు.
బ్రేకప్ చెప్పినా తనను మాజీ బాయ్ ఫ్రెండ్ వేధించడంతో పాటు అత్యాచార యత్నం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు లలిత్ సెహెగల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. ప్రేమించుకున్నారు. అయితే ఏడాది క్రితం వీరిద్దరూ విడిపోయారు. అయితే ఆమె.. తన స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతుందని తెలుసుకున్నాడు సెహెగల్.
ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్‌లో ఉంటున్న లలిత్ సెహెగల్.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడు లలిత్ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్ 376 రెడ్‌విత్ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.