ఈ మధ్య అమ్మాయిలు ఎందులోనూ తీసిపోవడం లేదు. అన్నిటిలోనూ మగాళ్లతో పాటు సమానంగా ఉంటున్నారు. గొడవలైనా, కొట్లాటలైనా, ఇంకేదైనా గానీ మగాళ్లు చేసే పనుల్లో వాటా కావాలని అడక్కుండానే తీసుకుంటున్నారు. అయితే చట్టం అనేది ఒకటి ఉంటుంది, తప్పు చేసినోళ్లు ఆడయినా, మగయినా ఒకటేగా. కొంతమంది ఉంటారండి, పని చేయించుకుని రేపు రా, ఎల్లుండి రా అని తిప్పించుకుంటూ ఉంటారు. గట్టిగా పని డబ్బులు అడిగితే.. ఏంట్రా నోరు లేస్తుంది ఆ? అంటూ నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, డబ్బులడిగినందుకు కొట్లాటకు దిగుతారు. తాజాగా ఒక ఆటోడ్రైవర్ తన జీతం డబ్బులు ఇమ్మని అడిగినందుకు నలుగురు మహిళలు అతని మీద విరుచుకుపడ్డారు.
చొక్కా చిరిగేలా అతన్ని కొడుతూ అందరి ముందు అవమానించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో దినేష్ అనే వ్యక్తి ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. గతంలో రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ లో.. రాహుల్ ట్రావెల్స్ కంపెనీలో తన ఆటో నడిపాడు. ఆ సమయంలో సదరు ట్రావెల్స్ కంపెనీ అతనికి సరిగా జీతం ఇవ్వలేదు. జీతం అడిగితే రేపు రా, ఎల్లుండి రా అంటూ దాటవేస్తున్నారు. దీంతో కంపెనీ మేనేజర్ ని కలిసి తన గోడు వినిపించుకోవాలని ఎయిర్ పోర్ట్ లో ఉన్న ట్రావెల్ ఆఫీస్ కి వెళ్ళాడు. అయితే అక్కడ పని చేసే మహిళా ఉద్యోగులను మేనేజర్ ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాడు.
దీంతో మహిళలు, ఆటోడ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళలు ఆటోడ్రైవర్ మీద రెచ్చిపోయారు. చొక్కా చిరిగేలా కొట్టారు. చేతులతో, బెల్ట్ తో కొడుతూ అతని మీద దయ లేకుండా విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటోడ్రైవర్ పై దాడి చేసిన మహిళలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మగాడి మీద విచక్షణారహితంగా దాడి చేసిన ఈ మహిళలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Raipur- The young man was beaten with a belt by the women at Swami Vivekananda Airport, Raipur.#Raipur #Airport #chhattisgarh #ViralVideo pic.twitter.com/BiGQM3k5EC
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 19, 2022