ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
గ్రీస్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో 85 మందికి పైగా గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కికి వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు.. తెంపీకి దగ్గర్లో ఎదురుగా వస్తున్న కార్గో ట్రైన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ప్యాసింజర్ రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మరిన్ని బోగీలు పట్టాలు తప్పి దూరంగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే అక్కడికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టారు.
ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపుగా 350 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 200 మందిని భద్రతా దళాలు, సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు బోగీల్లో 32 మంది సజీవదహనమయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగుతుండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోందని ఆఫీసర్స్ అంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Two trains collided head-on in Greece killing at least 32 people and injuring 85 but the cause of the deadliest rail crash in the country in decades remained unclear https://t.co/shpnvtqHI5 pic.twitter.com/UL6Bakmctm
— Reuters (@Reuters) March 1, 2023