ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా డీజే సౌండ్స్ మద్య కొంతమందికి హార్ట్ స్టోక్, బ్రేయిన్ స్టోక్ వస్తుందని.. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
మనిషిని మృత్యువు ఎప్పుడు ఎలా కబలిస్తుందో తెలియదు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు జరుగుతున్నా.. మనిషి ప్రాణాలకు మాత్రం భరసా లేకుండా పోతుంది. ఈ మద్య దేశంలో వరుసగా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు కరోనా భయం ఉంటే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ సాంస్కృతిక కార్యక్రమంలో తన స్నేహితులతో డ్యాన్స్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో తపాలా శాఖ మార్చి 13 నుంచి 17 వరకు ‘ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్’ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ మార్చి 17 న జరగనుండగా 16న స్టేడియం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సురేంద్ర కుమార్ దీక్షిత్ తన స్నేహితులతో హుషారుగా కొద్దిసేపు డ్యాన్స్ చేశాడు. అంతలోనే పక్కకు తిరిగి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు హాస్పిటల్ కి తరలించగా సురేంద్ర కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ మద్య ఆకస్మిక గుండెపోట్లు బాగా పెరిగిపోయాయి. జిమ్ చేస్తూ.. ఆటలు ఆడుతూ.. శుభ కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. కొంతమంది ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. జనవరిలో మధ్యప్రదేశ్ ఇండోర్ లో 16 ఏళ్ల వ్రిందా త్రిపాటీ అనే బాలిక రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు చనిపోయింది. ఈ మద్యనే ఖమ్మం జిల్లా అల్లీపురంలో ఓ పెళ్లి బారాత్ లో రాణీ అనే మహిళ బంధువులతో డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలిపోయింది. దాంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.
ప్రస్తుత కాలంలో యువత డబ్బు సంపాదించే క్రమంలో పని ఒత్తిడికి లోనై గుండెపోటు రావడం.. జిమ్ లో ఎక్కువగా వ్యాయామం చేయడం.. శుభ కార్యక్రమాల్లో డీజే సౌండ్స్ మధ్య జోష్ గా డ్యాన్స్ చేయడం ప్రాణాలకు ప్రమాదం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సినీ సెలబ్రెటీలు చాలా మంది జిమ్ లో వ్యాయామం చేస్తుండా చనిపోయిన విషయం తెలిసందే. మరికొంతమంది పెళ్లి, పుట్టిన రోజు వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ అక్కడే కుప్పకూలిపోతున్నారు. ఏది ఏమైనా అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు హఠాత్తుగా చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
बस आज की रात है जिंदगी…डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश के भोपाल का है#SuddenDeath #heartattack2023#Bhopal #MadhyaPradesh #heartattack pic.twitter.com/iemf1Qxhs6
— PraDeep yadav (@parthshay) March 20, 2023