Samastipur: కన్న తల్లి, తండ్రి ఆ బాలిక పాలిట రాక్షసుల్లా మారారు. బాలికను వ్యభిచార కూపంలోకి దింపి నరకం చూపించారు. సహాయం చేయాల్సిన పోలీసులు కూడా బాలికను వేధించారు. దీంతో బాలిక సెల్ఫీ వీడియోతో జనాన్ని సాయం కోరింది. ఆ వీడియో వైరలై బాలికకు సాయం అందింది. ఆ క్రూరమైన తల్లిదండ్రులు కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, సమస్తిపుర్‌కు చెందిన ఓ బాలిక కొద్దిరోజుల క్రితం ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
ఆ వీడియోలో .. ‘‘ ప్రతీరోజు నన్ను 20నుంచి 25 మంది దాకా పాడు చేస్తున్నారు. మా అమ్మ ఇంట్లోనే మందు అమ్ముతుంది. పోలీసులు కూడా ఇంటికి మందు తాగడానికి వస్తారు. చాలా మంది నాతో తప్పుగా ప్రవర్తించారు. నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. నాకు ఎవరూ సహాయం చేసేవారు లేరు. నా తండ్రి కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు.
నేను ఎదురు తిరిగితే బాగా కొట్టారు. చంపుతామని బెదిరించారు. దయ చేసి నన్ను కాపాడండి.. లేదా చంపేయండి!’’ అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లితండ్రిని అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవ దహనం