జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. కానీ.., కొంత మందికి అదృష్టం కలిసొచ్చితమకి ఉన్న టాలెంట్ కన్నా ఎక్కువ సక్సెస్ అవుతుంటారు. ఈ కోవకే చెందుతాడు ఫన్ బకెట్ భార్గవ్. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ చేస్తూ, భార్గవ్ షార్ట్ పిరియడ్ లోనే స్టార్ అయిపోయాడు. కానీ.., కష్టపడకుండా వచ్చిన సక్సెస్ కిక్ భార్గవ్ ని కుదురుగా ఉండనివ్వలేదు. డబ్బు, అమ్మాయిలు వెనుక పరుగులు తీసేలా చేసింది. చివరికి దారి తప్పిన అతని వ్యక్తిత్వమే అతన్ని కటాకటాల పాలు చేసింది. ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినా.. ఇప్పుడు భార్గవ్ లోని మరో చీకటి కోణం బయటపడింది. ధనార్జన కోసం భార్గవ్ వేసిన మాస్టర్ ప్లాన్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
ఆటిట్యూడ్ సమస్య:
నిజానికి భార్గవ్ కి ఆటిట్యూడ్ ఎక్కువన్న టాక్ బలంగా ఉంది. అతనితో పని చేసిన వ్యక్తులు, అతని ఫ్రెండ్స్ అందరూ చెప్పే మాట ఇదే. గతంలో వివిధ మీడియా సంస్థలకి భార్గవ్ ఇచ్చిన ఇంటర్వూస్ చూసినా ఈ విషయం అందరికీ అర్ధం అవుతుంది. అయితే.. తనతో వీడియోలు చేయడానికి వచ్చిన మైనర్ బాలికని లొంగతీసుకుని, ఆమెని గర్భవతిని చేసిన కేసులో భార్గవ్ గతంలో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు కోర్ట్ లో ఉండగానే.. బెయిల్ పై బయటకి వచ్చిన భార్గవ్ తన ఆటిట్యూడ్ ని మార్చుకోలేదు. కేసుని, భాదితులను, సాక్ష్యులను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి.. అదే కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. దీంతో.. భార్గవ్ ప్రవర్తనలో మార్పు రాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక భార్గవ్ గతంలో ఆర్ధికపరమైన మోసాలకు కూడా పాల్పడ్డ ఘటనలు, డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేసిన సంఘటనలు తాజాగా ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.
ఇన్ ఫ్లూఎన్సర్ గా బ్లాక్ మెయిల్:
యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ తో మొదలైన భార్గవ్ ప్రస్థానం.. ఆ వీడియోల కారణంగానే ఊహించని మలుపు తీసుకుంది. భార్గవ్ కి కాస్త పేరు రావడంతో చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, వివిధ సంస్థలు అతన్ని ఇన్ ఫ్లూఎన్సర్ గా పెట్టుకుని, వీడియో చేపించుకుంటూ ఉండేవి. ఆ సమయంలో తాను నెలకి రూ.8 లక్షల వరకు సంపాదించేవాడిని అని భార్గవ్ కూడా గొప్పగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే భార్గవ్ తాను ఏ సంస్థల కోసం పని చేసేవాడో.. వారినే బ్లాక్ మెయిల్ చేసేవాడా అంటే అవుననే సమాధానంవినిపిస్తోంది.
సూసైడ్ నాటకంతో ఆర్థిక మోసాలు:
ఏ సంస్థలు అయినా ఇన్ ఫ్లూఎన్సర్స్ కి ఒక బడ్జెట్ ఇచ్చి తమకి కావాల్సిన రీతిలో కంటెంట్ చేపించుకుంటూ ఉంటాయి. వాటికి ఎంత రీచ్ ఉంటే.. ఇన్ ఫ్లూఎన్సర్స్ కి అంత పారితోషికాలు ఇస్తారు. భార్గవ్ కూడా ఇలా భారీగానే వెనకేసుకున్నాడు. అయితే.. కాస్త పేరు వచ్చాక మాత్రం భార్గవ్ తనకి పని ఇచ్చిన సంస్థలను అదనంగా డబ్బు కోసం వేధించేవాడట.
తాను డిమాండ్ చేసినంత అమౌంట్ ఇవ్వకపోతే.. సూసైడ్ చేసుకున్నట్టు, చేతులు కట్ చేసుకున్నట్టు ఫోటోలు తీసి, అతని స్నేహితుల చేత ఆ ఫోటోలను కంపెనీ ప్రతినిధులకు ఫార్వార్డ్ చేపించేవాడట. దీంతో అవతల వ్యక్తులకు భార్గవ్ కోరిన అమౌంట్ ఇవ్వక తప్పేది కాదట. ఇలా భార్గవ్ బారిన పడ్డ కంపెనీలు చాలానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. గతంలో భార్గవ్ ఇలానే చేతులు కట్ చేసుకుని అమ్మాయిలని సైతం వేధించేవాడంటూ చాలా మంది కెమెరా ముందే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదే.. రీతిలో భార్గవ్ ఆర్థిక మోసాలకు సైతం తెగబడినట్టు స్పష్టం అవుతోంది. మరి.. తనకి పని కల్పించి, జీవితంలో పైకి ఎదగడానికి సహాయపడిన వారినే డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.