టాలీవుడ్‌ను నాలుగేళ్లుగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్‌లకు ఎఫ్‌ఎస్‌ఎల్(ఫొరెన్సిక్ సైన్సెస్ ల్యాబోరేటరీ) క్లీన్‌చిట్ ఇచ్చింది. వాళ్లు ఇద్దరూ డ్రగ్స్ వాడినట్లు తెలలేదని పేర్కొంది. 2017లో పూరీ జగన్నాథ్, తరుణ్ మరికొంతమంది సినీ తారల బ్లడ్, వెంట్రుకలు, గోర్లను డ్రగ్స్ కేసు విషయంలో సేకరించారు. వాటిని పరీక్షించి ఎఫ్‌ఎస్‌ఎల్ వీరిద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో పూరీ, తరణ్‌లకు కాస్త ఊరట లభించింది. దీంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.