టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ క్రైం కూడా పెరిగిపోతున్నది. అపరిచిత కాల్స్ ద్వారా, టెక్ట్స్ మెసేజెస్ ద్వారా వ్యక్తులను లేదా సంస్థలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో గిఫ్టుల పేరుతో కూడా ఛీటింగ్ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఇప్పుడు ఇంకో కొత్త రకం మోసం బయటపడింది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలకు లైకులు కొడితే చాలు అని సైబర్ నేరగాళ్లు నమ్మబలికి డబ్బు దోచుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

మొబైల్ లో గాని, లాప్ టాప్ లోగాని మనకు సమయం దొరికినపుడు సోషల్ మీడియాలో గడిపేస్తుంటాం. అందులో వచ్చే వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తాము. ఆ వీడియో బాగా నచ్చినట్లైతే దానికి ఓ లైక్ కొట్టడం అందరికి అలవాటే గద. ఈ అలవాటునే ఆసరగా చేసుకుని దోపిడి చేసే నయా దందాకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. వీళ్ల మాయలో పడి ఏకంగా రూ. 42 లక్షలు పోగొట్టుకున్నాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గురుగ్రామ్ లో ఓ ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఇస్తామని మెసేజ్ పంపాడు సైబర్ నేరస్థుడు. వీడియోకి లైక్ కొడితే రూ. 50 ఇస్తామని అందులో ఉంది. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించ వచ్చని చెప్పారు. తరువాత బాధితుడిని టెలిగ్రామ్‌లోని ఒక గ్రూప్‌లో యాడ్ చేశారు. అక్కడ అతనికి కొన్ని యూట్యూబ్ వీడియోలను లైక్ చేయమని, హామీతో కూడిన రాబడిని సంపాదించమని సూచించబడింది. ఆ గ్రూప్ కి దివ్య అనే మహిళ పేరు పెట్టి ఉంది. గ్రూప్‌లో చేరిన వెంటనే పలువురు గ్రూప్ సభ్యులు హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేయడం ద్వారా తన డబ్బును పెట్టుబడి పెట్టమని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఒప్పించారు.
గ్రూప్ సభ్యుల ప్రేరణతో తన బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే కాకుండా తన భార్య బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.42,31,600 బదిలీ చేశాడు. ఆ తరువాత రూ.69 లక్షలు లాభం వచ్చిందని బాధితుడికి చెప్పారు. అయితే వచ్చిన డబ్బును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మరో రూ.11వేలు అదనంగా ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి టెలిగ్రామ్ గ్రూపులో మోసగాళ్లపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని మోసగాళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జరిగిన మోసం పై వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.