రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా ఓ దుండగుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. కొందరి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ కిరాతకుడు ఓ అమాయకుడి ప్రయాణికుడిపై విచాక్షణా రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దాడి దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఫ్రాన్స్ లోని ప్యారిస్ నగరం. బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు వారి వారి గమ్యాలకు చేరుకునేందుకు రైల్ కోసం వేచి చూసి చూస్తూ అపార్ట్ మెంట్లపై నిలబడ్డారు. ఈ సమయంలోనే లిబియా నుంచి వలస వచ్చిన మహ్మద్ అమీన్ అనే యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. రైల్వే స్టేషన్ లో ఉన్న ఆరుగురి ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ఆ యువకుడిని కింద పడేసి అతనిపై కత్తితో విచాక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇతని దాడిలో ఆ యువకుడు రక్తపు మడుగులో పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై స్పందించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ అమీన్ ని చివరికి పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక గాయపడ్డ యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దాడి దృశ్యాలను కొందరు యువకులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.