నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కుంటున్న.. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ ను అరెస్ట్ చేశారు.
నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కుంటున్న.. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ ను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులకు నార్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా, సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తాను రాసిన సూసైడ్ నోట్‌లో వీరి నలుగురు పేర్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురి వేధింపులు, ఒత్తడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
సాత్విక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు, పై నలుగురిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడే.. సాత్విక్. నార్సింగ్ లోని శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే సాత్విక్ ఉన్నట్టుండి మంగళవారం(ఫిబ్రవరి 28) కాలేజ్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్, టీచర్ శోభన్ నరకం చూపిస్తున్నారని అందులో రాసి ఉంది. వారి టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సాత్విక్ తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
కాగా, సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విచారణ చేపట్టింది. డీఈవో ఆధ్వర్యంలో అధికారులు నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌ను సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా అధికారులు సిద్దం చేశారు. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు శ్రీ చైతన్య యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. దీనిపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు రిపోర్టును సిద్దం చేసి ఇంటర్ బోర్డు కమిషనర్‌కు అందజేయనున్నారు.
ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్ట్..!! pic.twitter.com/5SsPP4lAT3
— oneindiatelugu (@oneindiatelugu) March 3, 2023