ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో పోలీసులది కీలక పాత్ర. సంఘ విద్రోహక శక్తులు, రౌడీమూకల నుంచి ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. అప్పుడప్పుడు పోలీసులు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. నిందితులను పట్టుకునే క్రమంలో కొందరు అమాయకులు బలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా పోలీసుల బూటు కాళ్ల కింద నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడంలో పోలీసులది కీలక పాత్ర. సంఘ విద్రోహక శక్తులు, రౌడీమూకల నుంచి ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. అయితే పోలీసులపై చాలా మందికి ఓ రకమైన అభిప్రాయం బలంగా ఉంది. వారు అమాయకులపై మాత్రం తమ అధికారం చూపిస్తారని, ధనవంతులను మరోలా చూస్తారని కొందరు అభిప్రాయపడుతుంటారు. అలానే అప్పుడప్పుడు పోలీసులు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. నిందితులను పట్టుకునే క్రమంలో కొందరు అమాయకులు బలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల బూటు కాళ్ల కింద నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తొక్కడం వల్లనే తమ బిడ్డ మరణించిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణమైన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
జార్ఖండ్ జిల్లా గిరిడీ జిల్లాలోని ఓ ప్రాంతంలో భూషన్ పాండే అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. చాలా రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. భూషన్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడి ఇంటిపై నిఘా పెట్టారు. అతడు ఇంటికి వచ్చాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో పోలీసులు భూషన్ ఇంటికి వెళ్లారు. వారి రాకను గమనించిన భూషన్ అతడి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులు అక్కడి వెళ్లి చూడగా ఎవరు లేకపోవడంతో వెనుదిగారు. పోలీసులు వెళ్లిపోయాక భూషన్ కుటుంబం ఇంటికి వెళ్లింది. అక్కడ చూడగా తమ 4 రోజుల పసికందు విగతజీవిగా పడి ఉంది. గదిలో నిద్రిస్తున్న తమ బిడ్డను పోలీస్ కానిస్టేబుళ్లు బూటు కాలితో తొక్కడం వల్లే మరణించిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని భూషన్ పాండే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఈ ఇష్యూ కాస్తా నెటింట్లో తెగ వైరల్ అయి.. చివరకు పోలీసుల అధికారుల వరకు చేరింది. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరేన్ ఆదేశించారు.
మరోవైపు భూషన్ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను పోలీసులు కొట్టి పారేశారు. అతడు కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తరువాత అసలు వాస్తవాలు తెలుస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు, భూషన్ తెలిపిన వాదనలో ఎవరిది నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి