ఆ ఇద్దరు ప్రేమికులు, సదరు వివాహిత మహిళ ఓ ఇంట్లోకి వెళ్లారు. తర్వాత ముగ్గురూ పనిలో ఉండగా అనుకోని సంఘటన జరిగింది. ఆ ఘటన కారణంగా ఇద్దరి జీవితాలు తారుమారు అయ్యాయి. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు.
వింత విచిత్రమైన కొన్ని సంఘటనలు భారత్‌లో కంటే పక్క దేశాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల గురించి తెలుసుకున్నపుడు మనకు ఆశ్చర్యంతో పాటు ఏంట్రా ఇది అని కూడా అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు అయితే మన దిమ్మ తిరిగేలా చేస్తాయి. అలా మన దిమ్మ తిరిగేలా చేసే సంఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబుతున్నాం. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ఓ మగాడు.. ఇద్దరు మహిళలు శృంగారంలో పాల్గొన్నారు. కొద్దిసేపు బాగానే సాగినా.. తర్వాత ముగ్గురికీ గొడవ మొదలైంది. తీవ్రంగా కొట్టుకున్నారు. చివరకు ఓ ఇద్దరు జైలు పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల స్టీవెన్ లోపెజ్.. 20 ఏళ్ల ఏంజెలా వివియానా ప్రేమికులు. వీరు ఫ్లోరిడాలోని మనోర్ కౌంటీలో ఉంటున్నారు. ఈ ఇద్దరికీ మనోర్ కౌంటీకి చెందిన ఓ 29 ఏళ్ల వివాహితతో పరిచయం ఉంది. ముగ్గురూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఓ రోజు స్టీవెన్, ఏంజెలాకు ఓ పాడు ఆలోచన వచ్చింది. సదరు వివాహితతో కలిసి త్రీసమ్ ప్లాన్ చేద్దామని అనుకున్నారు. సదరు మహిళను అడగ్గా ఓకే చెప్పింది. ముగ్గురూ మనోర్ కౌంటీలోని ఇంట్లో శృంగారం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే గొడవ మొదలైంది. ఏంజెలా ఆ మహిళతో గొడవ పెట్టుకుంది.
కొద్దిసేపటికి ఆ గొడవ పెద్దదయింది. స్టీవెన్ ఆ గొడవను ఆపాల్సింది పోయి.. తన ప్రియురాలికి మద్దతు పలికాడు. తర్వాత ఆ ఇద్దరు ప్రేమికులు కలిసి మహిళపై దారుణంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహిళ కారుపై పెద్ద సిమెంట్ ఇటుకను పడేశారు. దీంతో ఆ మహిళ స్టీవెన్, ఏంజెలాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమికుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు జరిగిందంతా చెప్పారు. చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. మరి, అతిగా ఆశపడి.. ఆవేశం కారణంగా జైలు పాలైన ఆ ప్రేమికుల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.