ఈ మద్య దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయంది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే తమతో తెచ్చుకున్న గన్స్ తో దారుణంగా కాల్చివేస్తున్నారు. లైసెన్స్ లేని గన్స్ చిన్న చిన్న నేరస్థుల చేతుల్లో పడటంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.
ఈ మద్య దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది డబ్బు కోసం అక్రమ ఆయుధాలను సరఫరా చేయడంతో కేటుగాళ్లకు తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ల్యాండ్ సెటిల్ మెంట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, చిన్న చిన్న నేరాలు ఆయుధాలతో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ భూ వివాదంలో రెండు వర్గాల మద్య గొడవ ఏర్పడటంతో ఓ వర్గం వారు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన మద్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మద్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిహోనియా పోలీస్స్టేషన్ పరిధిలో లేపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మెరెనా జిల్లా లేపా గ్రామంలో భూ వివాదంపై రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. అందులో కొంతమంది తుపాకులు వెంట తెచ్చుకొని ప్రత్యర్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగులు అక్కడిక్కడే మరణించారు. మెరెనా జిల్లా లేప గ్రామంలో రాధే తోమర్, రంజిత్ తోమర్ కుటుంబాలు నివసిస్తు ఉండేవారు. గత కొంత కాలంగా ఓ భూ వివాదంలో ఇరు వర్గాల మద్య గొడవ సాగుతుంది. అయితే 2014 లో రాధే తోమర్ కుటుంబానికి చెందిన ముగ్గురిని రంజిత్ తోమర్ కుటుంబసభ్యులు హత్య చేసారు. ఒకే కుటుంబలోని వారిని హత్య చేసిన తర్వాత లేపా గ్రామం విడిచి వెళ్లిపోయారు. కొన్నిరోజులు అయ్యాక తిరిగి గ్రామానికి వచ్చారు రంజిత్ తొమర్ కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో రంజిత్ తోమర్ కుటుంబాన్ని అంతం చేయాలని.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు రాధే తోమర్ కుటుంబ సభ్యులు. శుక్రవారం ఇరు కుటుంబాల మధ్య భూ వివాదం మరోసారి తెరపైకి రావడం.. అది కాస్త ముదిరిపోవడంతో ఇరు వర్గాల మద్య కాల్పులు జరుపుకునే స్థాయికి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరు వర్గాల మద్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో రెండు గ్రూపులు పరస్పరం కాల్పులు జరగడంతో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. నిందితులంతా పరారయ్యారని.. గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
VIDEO | Clash and firing between two groups over an old land dispute in Lepa village of Morena district in Madhya Pradesh. pic.twitter.com/5CW4aUHgnS
— Press Trust of India (@PTI_News) May 5, 2023