రైలు ప్రమాదం.. కొడుకు కోసం శవాల మధ్య తండ్రి వెతుకులాట!

ప్రాణం నీటి బుడగలాంటిది. ఎప్పుడు ఎలా కాలం తీరుతుందో తెలియదు. అనుకోకుండా చోటు చేసుకునే ప్రమాదాలతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. ప్రమాదాల్లో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లి దండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోతారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు ఒక్కసారిగా ప్రాణాలతో లేరు ఇక తిరిగి రారు అని తెలిస్తే వారి కుటుంబసభ్యులు ఎంతటి క్షోభకు గురవుతారో ఊహకందని పరిణామం. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న కోరమండల్ రైలు ప్రమాదంలో గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తండ్రి తన కొడుకు కోసం శవాల మధ్య వెతుకుతు కన్నీటి పర్యంతమైన తీరు ప్రతిఒక్కరిని కలచివేస్తుంది.

దశాబ్ధకాలంలో మునుపెన్నడు లేనివిధంగా శుక్రవారం చోటుచేసుకున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హోరెత్తింది. వెంటనే స్పందించిన రైల్వే డిపార్ట్ మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక ప్రజలు కూడా ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కోల్ కతా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒడిషాలోని బాలాసోర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో కన్నీళ్లు తెప్పించే సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు ప్రయాణికులు దాదాపు 300 వరకు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారు వందల్లో ఉన్నారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కొడుకు ఆచూకి కోసం శవాల మధ్య వెతుకుతూ కన్నీటిపర్యంతమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హృదయం ద్రవించుకు పోతుందంటూ స్పందిస్తున్నారు. అయితే ఆ వీడియోలో ఓ యువకుడు ఆ తండ్రిని ఎవరి కోసం వెతుకుతున్నారని ప్రశ్నించగా తన కొడుకు కోసం అని చెప్పారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులోనే తన కొడుకు ప్రయాణించినట్లు తెలిపాడు. వారు షుగ్గో ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తన కొడుకు ఆచూకీ దొరకలేదని దుఖాన్ని దిగమింగుకుంటూ చెప్పాడు. ఇదే విషయమై పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపాడు. శవాల మధ్య తన కొడుకు కోసం వెతుకుతు ఆ తండ్రి రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరి హృదయాల్ని కలిచివేస్తుంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed