ఈ మధ్యకాలంలో ముక్కుపచ్చలారని చిన్నారులపై కన్న తండ్రులే దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాక వారి కోపాన్ని పసి పిల్లలపై ప్రయోగిస్తున్నారు. ఇలా బరి తెగించి ప్రవర్తించిన ఓ తండ్రి రెండు నెలల కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఆనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతం. మల్లిఖార్జునకు ఓ యువతితో గతంలో వివాహం జరిగింది. కొంత కాలం వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అయితే ఈ మధ్యకాలంలో వీరికి ఓ కూతురు పుట్టింది. కూతురు నా పోలికలతో పుట్టలేదని కొన్ని రోజుల నుంచి మల్లీఖార్జున తన భార్యతో గొడవకు దిగాడు.
దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య రోజు రోజుకు తీవ్ర వివాదంగా మారింది. అయితే గురువారం రాత్రి తండ్రి తన కూతురిని తీసుకెళ్లి పరారయ్యాడు. దీంతో స్పందించిన భార్య ఖంగారుగా ఏం చేయాలో తెలియక అటు ఇటు వెతికింది. ఎంతకు తన కూతురి జాడ తెలియకపోవటంతో భార్య భర్తపై అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప జాడకోసం రాత్రంత గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఈ రోజు ఓ గోనెసంచిలో పాప నీర్జీవంగా కనిపిస్తూ పోలీసులకు దొరకింది. తండ్రి మల్లిఖార్జున రెండు నెలల పసిపాప నోటికి ప్లాస్టర్ వేసి చంపేసినట్లు తెలిపారు. ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఓ గోనెసంచిలో పడేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇక భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను పట్టుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.