ఈ సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వదిన, అత్త, కూతురు ఇలా వావివరసలు మరిచి కొందరు బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగక.. కోరిక తీర్చుకునేందుకు నిరాకరిస్తే వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఓ తల్లి లేని కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురన్న కనికరం మరిచి అత్యాచారం చేసి.. ఆపై గర్భవతిని చేశాడు. తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా సంచలనంగా మారుతోంది.
రంగారెడ్డి జల్లా ఫరుఖ్ నగర్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నారు. వీరికి 16 ఏళ్ల కూతురు ఉంది. అయితే అనారోగ్య కారణాలతో అతని భార్య గతంలో మరణించింది. దీంతో అప్పటి నుంచి ఆ బాలిక తండ్రి వద్దే ఉంటూ చదువుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచింది. ఈ క్రమంలోనే తల్లిలేని బిడ్డను ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన తండ్రే చివరికి కాలయముడిలా మారాడు. తండ్రి గత కొంత కాలం నుంచి కూతురుని బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తండ్రి దారుణాన్ని కూతురు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తనలో తాను కుమిలిపోయింది.
అయితే ఇటీవల ఆ బాలిక స్కూల్ లో వాంతులు చేసుకుంది. ఏం జరిగిందని స్కూల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త విన్న స్కూల్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం ఆ బాలికను ప్రశ్నించగా.. నా తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. తల్లి లేని కూతురుని గర్భవతిని చేసిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.