Vimalraj: ప్రముఖ కబడ్డీ ప్లేయర్ విమల్‌రాజ్ నాడార్ దారుణ హత్యకు గురయ్యారు. పాత పగల నేపథ్యంలో ఆయన్ని ప్రత్యర్థులు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, ధారావి ఏరియాకు చెందిన విమల్‌రాజ్ నాడార్ తన కబడ్డీ ఆటతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. విమల్‌రాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన కొందరితో పాత పగలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ నలుగురు వ్యక్తులు విమల్‌రాజ్ ఇంటి వద్దకు వచ్చారు. అతడితో గొడవ పెట్టుకున్నారు. ఈ గొడవ సందర్భంగా విమల్‌ను పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఓ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, విమల్‌రాజ్ హత్యతో ధారావిలో కలకలం రేగింది.
బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలంటూ వందల సంఖ్యలో జనం రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. పోలీసులు వారికి న్యాయం చేస్తామని హమీ ఇవ్వటంతో వెనుదిరిగారు. విమల్‌రాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని బీజేపీ స్థానిక నాయకుడు తమిళ్ సెల్వన్ కోరారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ ముగ్గురు యువతుల డెడ్‌బాడీలు!