ఏదైనా వస్తువు రిపేర్‌కు వచ్చినపుడు కస్టమర్ కేర్ సెంటర్ల కోసం వెతకటానికి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాము. అక్కడ కనిపించిన వెబ్‌సైట్లలోని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తూ ఉంటాము..
మనం ఎంతో కష్టపడి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను కొంటూ ఉంటాము. వస్తువులు అన్న తర్వాత రిపేర్లు రావటం కామన్. అయితే, వారంటీ ముగియక ముందే రిపేర్లు వస్తే.. మనం వాటిని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి రిపేర్ చేయించటం కంటే.. కంపెనీకి చెందిన సర్వీస్ సెంటర్లకు ఇచ్చి రిపేర్లు చేయిస్తూ ఉంటాము. అలా కాకపోతే నేరుగా ఇంటి వద్దకు వచ్చి రిపేర్ చేసే ఆప్చన్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాము. సెర్చ్‌లో కనిపించిన నెంబర్లకు ఫోన్ చేస్తుంటాము. అయితే, ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సైబర్ నేరగాళ్లు ఫేక్ సర్వీస్ సెంటర్లను సృష్టించి కస్టమర్లను ముంచేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ దందా కోసం నకిలీ వెబ్‌సైట్లను సైతం తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మనం కస్టమర్ కేర్ సెంటర్ల కోసం వెతికినపుడు.. ఫేక్ సర్వీస్ సెంటర్ వివరాలు ప్రధానంగా కనిపించేలా చేస్తున్నారు. అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినపుడు నకిలీ కస్టమర్ సెంటర్లకు వెళతాయి. మనం మన సమస్యను చెప్పినపుడు ఓ సర్వీస్ ఏజెంట్‌ను పంపిస్తామంటారు. ఆ వచ్చిన వాళ్లు పాడైన వస్తువుల్లో అనవసరమైన సమస్య ఉందని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేస్తారు. అయితే, కొన్నిసార్లు వచ్చే సర్వీస్ ఏజెంట్లకు కూడా తాము నకిలీ సర్వీస్ సెంటర్ల కోసం పని చేస్తున్నామని తెలియటం లేదు.
ఇలాంటి నేరాలకు పాల్పడిన ఓ ముఠాను గతంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే.. ఆన్‌లైన్లో వెతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి నిజమైనవా? కాదా? అని సెర్చ్ చేసుకోవాలి. హెచ్‌టీటీపీఎస్, ప్యాడ్‌లాక్ ఉందా లేదా చూసుకోవాలి. వస్తువులు కొన్న వారికే నేరుగా ఫోన్ చేయటం మంచిది. లేదా కొన్నప్పుడు ఇచ్చిన రసీదుల్లోని నెంబర్లకు ఫోన్ చేయాలి. వచ్చిన వారు ఎంత వసూళు చేస్తారో ముందుగానే విచారించుకోవటం మంచింది. మరి, ఫేక్ సర్వీస్ సెంటర్ల క్రైంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.