ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. భర్తకు దూరంగా ఉంటూ ప్రియుడితో సహజీవనం చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రియుడితో గడిపేందుకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని కిరాతకానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్ని రోజులకు ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కుమారుడిని చూసుకుంటూ భార్యాభర్తలు సంసారాన్ని కొనసాగించారు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, కొన్ని రోజుల నుంచి ఆ మహిళ భర్తకు దూరంగా బతికింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ కొన్నాళ్ల నుంచి సహజీవనం చేశారు. ఇక ప్రియుడితో గడిపేందుకు కుమారుడు అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి ప్రియుడితో చేతులు కలిపి దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
మీడియా కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ లో వోర్సెస్టర్ పరిధిలోని డ్రోయిట్‌విచ్‌లో కార్లా స్కాట్ (35) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లై ఓ కుమారుడు (9) కూడా జన్మించాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, చాలా కాలం నుంచి భర్త దూరంగా కుమారుడితో పాటు ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు డిర్క్ హోవెల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతో ఇద్దరూ కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఇక చివరికి ప్రేమికులుగా మారి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ప్రియుడితో గడిపేందుకు 9 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని మహిళ భావించింది. కుమారుడిని ప్రాణాలతో లేకుండా చేసి ప్రియుడితో హ్యాపీగా ఉండాలని కలలు కనింది. ఇదే విషయాన్ని తన ప్రియుడికి వివరించింది.
దీనికి అతడు కూడా సరేనన్నాడు. ఇక అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి గతేడాది ఫిబ్రవరిలో 9 ఏళ్ల బాలుడిని నీటిలో ముంచి హత్య చేశారు. అనంతరం ఏం తెలియదన్నట్లుగా కార్లా స్కాట్.. కుమారుడికి శ్వాస ఆడడం లేదని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా ఆ బాలుడిని హత్య చేసింది ఆమె తల్లి, ఆమె ప్రియుడు అని గుట్టు విప్పారు. దీంతో పోలీసులు నిందితులైన కార్లా స్కాట్, డిర్క్ హోవెల్ లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో అసలు నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో గడిపేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని హత్య చేయించిన కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.