బీజేపీ నేతను ఓ ముఠా హతమార్చింది. రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన పది రోజుల్లో ఇద్దరు బీజేపీ నేతలు హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. రాజకీయం అనేది రణరంగం. రాజకీయాల్లో చేరాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. రాజకీయాల్లో మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉంటారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అవకాశం రాగానే మట్టుపెడతారు. దారుణ హత్య చోటు చేసుకుంది. బీజేపీ ముఖ్య నేత దారుణ హత్యకు గురయ్యారు. ఏప్రిల్ 18న కర్ణాటకలోని బీజేపీ యువనేత ప్రవీణ్ కమ్మర్ హత్యకు గురయ్యాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన మరువక ముందే మరో బీజేపీ నేత హత్యకు గురవ్వడం కలకలం రేపింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు.
పని ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తున్న బీజేపీ నేతపై కొంతమంది దుండగులు నాటుబాంబులతో దాడి చేశారు. అనంతరం వెంటపడి కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లాలో శ్రీ పెరంబదూర్ లో బీజేపీ పార్టీలో శంకర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు శంకర్. వరపురం పంచాయితీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీజేపీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర కోశాధికారిగా పని చేస్తున్న పీబీజీ శంకర్ ను కారులో వస్తుండగా ప్రత్యర్థులు కత్తులు, నాటుబాంబులతో దాడి చేసి హతమార్చారు. గురువారం రాత్రి పూందిపలై హైవే నుంచి కాంచీపురం వెళ్లే చెక్ పోస్ట్ సమీపంలో ఈ హత్య జరిగింది.
చెన్నై నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్న శంకర్.. పూనమల్లీ సమీపంలోని నజరాత్ పేట జంక్షన్ వద్దకు చేరుకోగానే అతని కారు మీద ఓ ముఠా నాటు బాంబులు విసిరింది. శంకర్ వెంటనే కారు దిగి పరుగులు పెట్టారు. పారిపోతుండగా శంకర్ ను ప్రత్యర్థులు కత్తులతో వెంటాడి మరీ చంపారు. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న నజరత్ పేట పోలీసులు శంకర్ మృతదేహాన్ని పరిశీలించారు. శంకర్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు లేదా రియల్ ఎస్టేట్ పోటీలో వచ్చిన గొడవలు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
#JUSTIN | சென்னையில் பாஜக பிரமுகர் கொடூரமாக படுகொலை#BBGShankar | #Shankar | #Poonamalee | #Nazarathpet | #BJP | #Murder pic.twitter.com/30i9qne67c
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 28, 2023