భర్తను కాదని కొందరు మహిళలు పరాయి వాడిపై మనసుపడి ఏకంగా అతనితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తున్నారు. ప్రియుడి మైకంలో పడి కట్టుకున్నవాడిని, పిల్లలను లెక్కచేయకుండా భర్త కన్న ప్రియుడే ముఖ్యమని అతనితో ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి భర్తకు భార్య అసలు రూపం బయటపడడంతో భర్తను హత్య చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను కాదని మరిదిపై మనసుపడి చివరికి విషయం భర్తకు తెలియడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఏలూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లల సంతానం. భర్తతో ఆమె కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉంది. అయితే వారి జీవితంలో ఫేస్ బుక్ చిచ్చు తెచ్చిపెట్టింది. ఫేస్ బుక్ లో వరుసకు మరిది అయ్యే రాము అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో ఆ మహిళ నిత్యం అతనితో చాటింగ్ లో మునిగిపోయి భర్తను అలాగే పిల్లలను పక్కకు నెట్టింది. ఇంతటితో ఆగకుండా ఏకంగా అతనితో వివాహేతర సంబంధాన్ని కూడా నడిపించింది.
ఇది కూడా చదవండి: Congo: మహిళ కిడ్నాప్.. మనిషి మాంసం తినిపించి ఆపై అత్యాచారం!
దీంతో రోజులు గడిచే కొద్ది వారి ఇద్దరి మధ్య బలం మరింత బలపడింది. ఇక భర్తకు తెలియకుండా భార్య కొన్నాళ్ల పాటు మరిదితో ఎంజాయ్ చేసింది. అసలు విషయం భర్తకు తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలియక ప్రియుడితో పాటు పారిపోయింది. ఇక కొన్ని రోజుల తర్వాత పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మా చావుకి ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్ రాసుకున్నారు . దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.