ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు వైవాహిక జీవితాన్ని గడుపుతూ వచ్చింది. అలా చాలా ఏళ్ల పాటు భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఏనాడు కూడా మనస్పర్థలు, గొడవలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ, భార్య మాత్రం తాళికట్టిన భర్తను మోసం చేసి.. పరాయి మగాడిపై మనసు పడింది. అలా కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇక ఇంతటితో ఆగని ఈ రాక్షస భార్య ఊహించని దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. అసలేం జరిగిందంటే?
ఏలూరు జిల్లా ముసునూరు మండలం యల్లాపురం గ్రామం. ఇక్కడే రాయనపాటి రాటాలు (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా రాను రాను రాటాలు భార్య బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. ఇంతటితో ఆగని ఈ ఇల్లాలు.. భర్తను కాదని స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. భార్య రాటాలుకు తెలియకుండా గత కొన్నేళ్ల నుంచి ఈ వ్యవహారాన్ని నడిపించింది. అయితే భార్య రంకుపురాణం ఇటీవల భర్త చెవిన పడింది.
దీంతో కోపంలో ఊగిపోయిన భర్త.. భార్యను అనేక సార్లు మందలించాడు. అయినా భార్య బుద్ది మార్చుకోలేక.. ప్రియుడితో ఉండలేకపోయింది. కానీ, ఆ మహిళ భర్త కన్న ప్రియుడితోనే ఉండాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ మహిళకు ఓ దారుణమైన ఆలోచన పుట్టింది. అదే తన భర్త చంపడం. ఈ దర్మార్గులు ఇలా అనుకుందో లేదో.. ప్లాన్ ను పక్కాగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఇక భర్త హత్యలో భాగంగా ముందుగా ఇదే విషయాన్ని తన ప్రియుడికి వివరించింది. ఇది విన్న ప్రియుడు సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే జనవరి 3న భర్త రాటాలు పని మీద రమణక్కపేటకు వెళ్లాడు. ఇక హత్యలో భాగంగా అదే రోజు రాత్రి రాటాలు భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో ముగ్గురు కలిసి రాటాలును రమణక్కపేటకు తిరిగి వస్తుండగా మధ్యలో పట్టుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి రాటాలును దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉండే తోటలో పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇక రెండు మూడు రోజులు అయినా రాటాలు కనిపించకుండపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. రమణక్కపేట పరిధిలోని ఓ తోటలో సగం కాలిన శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సగం కాలిన శవాన్ని పరిశీలించగా… అదే కనిపించకుండా పోయిన రాటాలు శవం అని పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా ముందుగా.. రాటాలు భార్యను విచారించారు. అయితే అతని భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. ఇక రాటాలు భార్యను పోలీసుల ఇంకాస్త గట్టిగా విచారించగా.. అసలు నిజాలు బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో.. ప్రియుడితో కలసి చంపానని తెలిపింది. అనంతరం పోలీసులు రాటాలు భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడిపై మోజులో పడి కట్టుకున్న భర్తను చంపిన ఈ రాక్షస భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.