భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రధాన్యత ఉంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వివాహ వ్యవస్థకు వివాహేతర సంబంధాల కారణంగా కొందరు భంగం కలిగిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ అక్రమ సంబంధానికి అడ్డు ఎవరొచ్చినా అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ. ఇదే గ్రామానికి చెందిన వీర్రాజుకు అగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామానికి చెందిన శ్రావణితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ శ్రావణికి పెళ్లి కంటే ముందే ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. అప్పటి నుంచి భర్తను కాదని ఎవరికీ తెలియకుండా ప్రియుడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. దీంతో పాటు శ్రావణి ప్రియుడిని ఏకంగా ఇంటికి తెచ్చుకుని ఇంట్లోనే కాపురం పెట్టేది.
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తుండడంతో ఎలాగైన సరే భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆ దిశగా ప్రయాత్నాలు కూడా చేసింది. అయితే ఈ నెల 9న శ్రావణి ప్రియుడు ఇంటికొచ్చి.., వీర్రాజుతో మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లాక అతనికి బాగా మద్యం తాగించారు. వీర్రాజు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక శ్రావణి ప్రియుడు తన వెంటతెచ్చుకున్న కత్తితో వీర్రాజును దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న వీర్రాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం వీర్రాజు హత్యపై తన తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.