గ్రే రోడ్డు ప్రక్కన ఉన్న పుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతోంది. ఆమె కాళ్లు సరిగా పని చేయవు. కళ్లు కూడా సరిగా కనిపించవు. అందుకే పుట్‌పాత్‌పైనే నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫుట్‌పాత్‌పై ఓ యువతి సైకిల్‌పై ఆమెకు ఎదురుగా వచ్చింది..
తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే.. మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు. ఈ మాట ఎవ్వరికైనా వర్తిస్తుంది. ముఖ్యంగా నేరాల విషయంలో.. మన పూర్తి స్ప్రహతో చేసినా.. పొరపాటున జరిగినా.. మనం చేసిన నేరాలకు శిక్ష తప్పదు. కానీ, కోర్టులో మనం ఏ ఉద్దేశ్యంతో ఆ నేరం చేశామన్న దానిపై శిక్ష పడే విషయంలో మార్పులు ఉంటాయి. తాజాగా, ఓ మహిళ విషయంలో కూడా కోర్టు ఈ విధంగానే నిర్ణయం తీసుకుంది. ఆమె ఓ చావుకు కారణం అవ్వటంతో హత్యా నేరం కింద శిక్ష పడింది. కోర్టు ఆమెకు మూడేళ్ల పాటు శిక్ష విధించింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని పీటర్‌బోరా క్రౌన్ కోర్టులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌షేర్‌కు చెందిన ఆరియల్ గ్రే అనే 49 ఏళ్ల మహిళ 2020, అక్టోబర్ 20 రోడ్డు పక్కన ఉన్న పుట్‌పాత్‌పై వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఓ యువతి ఫుట్‌పాత్‌పై సైకిల్‌పై ఆమెకు ఎదురుగా రాసాగింది. ఇది గమనించిన గ్రే, యువతిని పక్కకు వెళ్లమని చేతులతో సైగ చేసింది. దీంతో ఆ యువతి పక్కకు వెళ్లటానికి సైకిల్ తిప్పింది. దీంతో సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడింది. సైకిల్‌పై ఉన్న యువతి కూడా కిందపడింది. ఆమె కిందపడగానే అటు వైపు వచ్చిన ఓ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి చనిపోయింది.
యువతి చావుకు కారణమైనందుకు పోలీసులు గ్రే మీద మర్డర్ కేసు నమోదు చేశారు. ఇక, అప్పటినుంచి గ్రే కోర్టుల చుట్టూ తిరుగుతోంది. గురువారం పీటర్‌బోరా క్రౌన్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఆ మహిళ దివ్యాంగురాలని, కళ్లు కూడా సరిగా కనిపించవని కోర్టుకు తెలిసింది. దీంతో ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు కేవలం 3 ఏళ్ల జైలు శిక్షను మాత్రమే విధించింది. అయితే, ఈ కేసును పైకోర్టులో సవాల్ చేసేందుకు గ్రే సిద్దమైంది. మరి, ఈ కేసులో ఆమె గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.