నచ్చిన ఆడది కనబడితే చాలు.., ప్రేమించాలని వెంటపడడం, కాదు, కూడదు అంటే యాసిడ్ దాడులు, హత్యలు. ఇవే నేటి కాలంలో కొందరు దుర్మార్గులు చేస్తున్న దారుణాలు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఈజిప్టులో ఓ కిరాతకుడు యువతి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. జూన్ నెలలో జరిగిన ఈ హత్యాకాండ ప్రపంచ సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రేమోన్మాది ఘాతుకంపై స్పందించిన ఈజిప్టు కోర్టు నిందితుడికి ఉరి శిక్షవిధించింది. మరో విషయం ఏంటంటే? ఇతని మరణ శిక్షను ప్రతీ ఒక్కరూ చూసేలా ప్రత్యక్షప్రసారం చేయాలని ఈజిప్ట్ పార్లమెంటుకు కోర్టు లెటర్ రాసింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఈజిప్ట్‌లోని మాన్‌సోరా యూనివర్సిటీలో నయెరా అష్రాఫ్ అనే యువతి చదువుతోంది. ఆమెతో పాటు ఇక్కడే చదువుతున్నాడు మోహమద్ అడెల్ అనే యువకుడు. ఒకే చోట చదువుకుంటుండడంతో ఇద్దరికి కాస్త పరిచయం పెరిగింది. ఇక కలిసి చదువుకునేవారు, కలిసి మాట్లాడుకునేవారు. అయితే ఈ క్రమంలోనే మోహమద్ అడెల్ ఆమెపై మనసుపడ్డాడు. ఎలాగైన ఆమెను పెళ్ళి చేసుకోవాలని భావించి ఇదే విషయాన్ని నయెరా అష్రాఫ్ కి చెప్పాడు. కానీ ఆమె మాత్రం అతనితో పెళ్ళికి నిరాకరించింది.
పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో మోహమద్ అడెల్ నయెరా అష్రాఫ్‌పై పగ పెంచుకున్నాడు. దీంతో ఆమెను చంపాలనే ప్లాన్ గీశాడు. అయితే నయెరా అష్రాఫ్ ఇటీవల ఒంటరిగా కనిపించడంతో మోహమద్ అడెల్ నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా నయెరా అష్రాఫ్ ని దారుణంగా హత్య చేశాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణంపై అక్కడి యువత నిరసనలు తెలియజేస్తూ నిందితుడికి కఠిన శిక్షవిధించాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మాన్ సోరా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధించాలని జూన్ 28న ఆదేశాలు జారీ చేసింది.
ఇంతటితో ఆగకుండా నిందితుడి ఉరి శిక్షను అందరూ చూసేలా ప్రత్యక్షప్రసారం చేయాలని మాన్ సోరా కోర్టు ఈజిప్ట్ పార్లమెంటుకు లేఖ రాసింది. ఇక పూర్తిగా ఉరి తీయడం వీలు లేకున్నా.., కనీసం అతని ఉరి ఏర్పాట్లనైన చూపించాలని కోరింది. ఆ దుర్మార్గుడు చేసిన దారుణాన్ని దేశం మొత్తం చూడాలని, ఇలాంటి దారుణాలు మళ్లీ చేసేవారికి వెన్నులో వణుకు పుట్టాలంటే రాజ్యసభ అందుకు అనుమతించాలని కోర్టు లేఖలో పేర్కొంది. సరిగ్గా 1998లో రాజధాని కైరాలో ఓ మహిళ, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసిన ముగ్గురి నిందితుల ఉరిశిక్షను ప్రత్యక్షప్రసారంగా చూపించడం విశేషం. మోహమద్ అడెల్ కి ఖచ్చితంగా ఉరిశిక్ష అమలు అవుతుందా? అతని క్షమాబిక్షకు ఇంకా అవకాశం ఉండడంతో ముందు ముందు ఏం జరుగుతుందోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మొగుడిపై అనుమానం.. జుట్టు కత్తిరించి దేహశుద్ది చేసిన భార్య!
The killing of Egyptian student Nayera Ashraf has been met with condemnation and ignited a debate about violence against women.
The suspect is a man who reportedly harassed her for months before the killing.
Read more: https://t.co/nLFZHE2vqC pic.twitter.com/RXraAtTpH0
— Al Jazeera English (@AJEnglish) June 23, 2022