ఆమెకు పెళ్లై రెండుళ్లు అవుతుంది. కన్నవాళ్లను వదిలి భర్తే సర్వస్వం అని నమ్మింది. భర్తపై నమ్మకంతో అత్తింట్లో అడుగు పెట్టిన ఏడాదికే ఆమె నరకాన్ని దగ్గరి నుంచి చూసింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెడితే.. కోరుకున్న సుఖం దక్కకపోగా అత్తింటివాళ్లు వేధింపులకు గురి చేశారు. మొదట్లో ఇవన్నీ మాములే అని సర్దకుంటు వెళ్లింది. కానీ వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో ఆ మహిళ భరించలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అసలేం జరిగిందంటే? అది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం. ఇదే గ్రామానికి చెందిన శిరీష (29) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. గత రెండేళ్ల కిందట ఆ యువతి తల్లిదండ్రులు కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబు అనే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కోరిన కట్న, కానుకలు సైతం భారీగానే ముట్టజెప్పారు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. ఇక రోజులు గడిచే కొద్ది భర్త వక్రబుద్దిని చూపిస్తూ వరకట్నం తేవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
దీనికి తోడు అత్తమామలు, ఆడపడుచుల నుంచి సైతం వేధింపులు మొదలయ్యాయి. కొన్నాళ్లు భరించినా శిరీష.. తర్వాత తట్టుకోలేక పోయింది. పెళ్లై రెండేళ్లే అవుతున్నా.. ఆమెకు కోరుకున్న సుఖం దక్కలేదు. వీటన్నిటినీ భరించడం నా వల్ల కాదనుకుందో ఏమో తెలియదు కానీ.., ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు.. అత్తమామలు, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురి మరణానికి అత్తింటివాళ్లే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.