ఆమె ఎన్నో కోరికలతో తల్లిదండ్రులు తీసుకొచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది. తాళికట్టిన భర్త తాను కోరుకున్న జీవితాన్ని అందిస్తాడని ఆశపడింది. కానీ ఆమె జీవితం పెళ్ళైన రెండు నెలలకే ముగుస్తుందని మాత్రం ఊహించలేకపోయింది. పెళ్ళై నెల రోజులు అయ్యిందో లేదో.. తన అసలు రూపాన్ని బయటకు తీసి భర్త భార్యను గొడ్డలితో నరికి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే పెళ్ళైన నెల రోజుల పాటు ఈ నవ దంపతులు సంతోషంగానే గడిపారు. అలా ఆనందంగా తన జీవితం సాగుతుందని పుష్ఫ అనుకునే లోపే భర్త రాక్షసుడిలా మారి తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. పెళ్ళైన నెలకు భార్యపై అనుమానం పెంచుకుని వివాహేతర సంబంధాన్ని అంటగట్టాడు. నువ్వు మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావని రోజూ వేధిస్తుండేవాడు. ఇదే విషయమై గత 15 రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగింది.
ఈ క్రమంలోనే హరీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే స్పందించిన కుటుంభికులు ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న హరీష్ ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాడు. ఇక వారం రోజులు అయిందో లేదో మళ్ళీ భార్యపై అనుమానంతో విషం కక్కాడు. ఇక ఈ క్రమంలోనే సోమవారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త హరీష్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు కుటుంభికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్ళైన రెండు నెలలకే భార్య హత్య, భర్త ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ క్షణికావేశానికి ఓ అందమైన కాపురం రెండు నెలలకే నేలకొరగడంతో అందరూ కంటతడి పెడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. క్షణికావేశంలో హరీష్ భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.