East Godavari: ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చనిపోయిన రెండు రోజుల తర్వాత అతడి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో యువకుడు మరణానికి గల కారణం ఏంటో తెలిసింది. ఆ కారణం తల్లిదండ్రులను ఎంతో కలత చెందేలా చేసింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లాకు సతీష్ పూజీ పూర్తి చేశాడు. ఈ నెల 24వ తేదీన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీటితో బరువెక్కిన హృదయాలతో తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. జీవిత చరమాంకంలో తమను చూసుకోవాల్సిన వాడు ఇలా అర్థాంతరంగా ఎందుకు తనువు చాలించాడో తెలియక తల్లిడిల్లిపోయారు. రెండు రోజులు గడిచాయి.
ఈ నెల 26న సతీష్ ఫోన్‌కు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ వాడుతున్న అతడి తండ్రి ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. మార్ఫింగ్ చేసిన సతీష్ న్యూడ్ ఫొటో కనిపించింది. తర్వాత వరుసగా మరికొన్ని మెసేజ్‌లు వచ్చాయి. సతీష్ ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడని, అప్పు తీర్చకపోవటంతో లోన్ యాప్ నిర్వహకులు సతీష్‌పై వేధింపులకు పాల్పడ్డారని ఆయన గుర్తించాడు. వారి వేధింపులు తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న నిర్ధారణకు వచ్చాడు. సతీష్ చనిపోయినా అతడి ఫోన్‌కు మెసేజ్‌లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయాడు.
వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో పలు నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు.. సతీష్ చదువు కోసం లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవటంతో యాప్ నిర్వహకులు ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. సతీష్‌ను బెదిరించటంతో పాటు అతడి ఫొటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలతో మానసిక క్షోభకు గురిచేశారు. దీంతో 24న ఇంట్లో సినిమాకు వెళుతున్నానని చెప్పి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nampally: నిండు నూరేళ్లు తోడుగా ఉంటానని మాటిచ్చాడు.. చివరికి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు!