ఒక డాక్టర్ వీర్యదానంతో ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. అయితే ఆయనకు అధికార యంత్రాంగం ఊహించని షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..!
ఒకప్పటి కంటే ఇప్పుడు సంతానలేమితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. జీవన శైలి మార్పుల వల్ల వచ్చే సమస్యల్లో సంతానలేమి కూడా ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతాన లేమి సమస్యతో బాధపడే దంపతుల్లో చాలా మంది ఆధునిక పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల కోసం అద్దె గర్భాల మీద ఆధారపడుతున్నారు. మరికొందరు వీర్యదానం ద్వారా సంతానం పొందుతుండటాన్ని చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో చాలామంది వీర్యదాతలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన జొనథన్ ఎం (41) అనే డాక్టర్ కూడా ఇదే కోవలోకి వస్తాడని చెప్పొచ్చు.
డచ్ వాసి అయిన జొనథన్ వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఇదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక మీదట జొనథన్ వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఒక మహిళ కోర్టులో కేసు వేశారు. ఈ మహిళ కూడా ఆయన వీర్యాన్ని వినియోగించే బిడ్డకు జన్మనిచ్చారు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌కు చెందిన జొనథన్.. ఇప్పటివరకు సొంత దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఆయన వీర్యదానం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. దీంతో నెదర్లాండ్స్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ది డచ్ సొసైట్ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఆయన్ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. జొనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్లు నెదర్లాండ్స్ మీడియా సమాచారం.
A Dutch sperm donor accused of fathering more than 500 children is being sued over claims he may have exposed women to an increased risk of accidental inbreeding https://t.co/QUShiIoauC
— The Times and The Sunday Times (@thetimes) March 27, 2023