అతనికి రోజుకో అమ్మాయి కావాలి.
అందుకు అతగాడి ప్రియురాలు సాయం
ఈజీ మనీ కోసం వెరైటీ కిల్లర్ కపుల్
పైశాచిక ఆకృత్యాలు… అత్యాచారాలు… హత్యలు!..
ఓ కేసు తీగ లాగితే పైశాచిక దంపతుల ఆకృత్యాలన్నీ బయటకొస్తున్నాయి. హైదరాబాద్ లోని దుండిగల్ లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి అడువుల్లోకి తీసుకెళ్లి వారిని హత్య చేస్తున్న ఉదంతం బయటకొచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
విలాసాలకు అలవాటు పడిన కురువస్వామి మహిళలను మాయమాటలతో లోబరుచుకునేవాడు. వాళ్లను శారీరకంగా అనుభవించాక వారి ఒంటి పైన ఉన్న ఆభరణాలతోపరారయ్యేవాడు. ఆభరణాలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాడు. గత తొమ్మిదేళ్లుగా చేస్తున్ననేర చరిత్రకు ఇటీవల జరిగిన హత్యతో ప్రస్తుతం పోలీసులు చెక్ పెట్టారు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైన మహిళ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన కిలాడీ జంట నేర చరిత్ర తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
వికారాబాద్ కు చెందిన కురువస్వామి ఐడీఏ బొల్లారం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటూ డ్రైవర్ గా, కూలీగా పని చేస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం పరిచయం అయిన మనసమొల్ల నర్సమ్మతో కొంతకాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నాడు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురైన భామిని హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళను హత్య చేసినట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు.
‘రోజుకో అమ్మాయికావాలి ఎవరినైనా తీసుకొస్తే తీసుకురా లేదంటే నిన్నువదిలేస్తా’నంటూ బెదిరించేవాడనీ, తప్పనిసరి పరిస్ధితుల్లో స్వామి చేసే అఘాయిత్యాలకు సహకరించానని చెప్పింది. వారు ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడు, లేదంటే నరకం చూపించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరను కుంటే వదిలేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారనుకుంటే వారిని కిరాతకంగా హత్యచేసేవాడు అని నర్సమ్మ విచారణలో పోలీసులకు వివరించింది.