డ్రగ్స్ మాఫీయా ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వివిధ మార్గాల్లో దేశంలోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ ముఠాను ఎప్పటికప్పుడు పట్టుకుని అరెస్టు చేస్తున్నా… కొత్త మార్గాల్లో ఈ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమల పండ్ల మాటున దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే డ్రగ్స్ సరఫరా చేస్తుండగా అధికారులు గుర్తించారు. ముంబైలో కమల పండ్లను దిగుమతి చేసే ట్రక్ లో సుమారు రూ.1476 కోట్ల విలువైన మెథాం ఫేటమిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువెళ్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆ ట్రక్కును ఆపి.. డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేయగా ఈ ఘటన వెలుగుచూసింది.
ముంబయిలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. వారి అందిన పక్కా సమాచారం మేరకు వాషి ప్రాంతంలో కమాల పండ్లతో వెళ్తున్న ఓ ట్రక్కును అడ్డుకున్నారు. అందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కమలా పండ్ల డబ్బాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అత్యంత స్వచ్ఛమైన ఘనరూపంలో ఉన్న 198 కిలోల డ్రగ్స్ (మెథ్)ను, 9 కిలోల కొకెయిన్ గా పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ. 1476 కోట్లుగా ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘పండ్ల మాటున పెద్ద మొత్తంలో తరలిస్తున్న డ్రగ్స్ ను పట్టుకున్నాం. దిగుమతిదారుని అదుపులోకి తీసుకుని వాచారిస్తున్నాం. మరింత సమాచారం కోసం దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోంది” అని డీఆర్ఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Maharashtra | Directorate of Revenue Intelligence (DRI), Mumbai recovered 198 kg high purity crystal methamphetamine (ice) & 9 kg high purity cocaine worth Rs 1476 crores after a truck carrying imported oranges was intercepted in Vashi, Mumbai: DRI Mumbai
— ANI (@ANI) October 1, 2022