డ్రగ్స్ కేసులో కీలక నిందితుడుని నార్కోటిక్ వింగ్ పోలీసులు అరెస్టు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లక్ష్మీపతిగా గుర్తించిన పోలీసులు నల్లకుంటలో బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా ఉన్నాడని తేల్చారు. అయితే నిందితుడు లక్ష్మీపతి హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సప్లై చేసేవాడని ఏడేళ్లుగా గంజాయికి బానిసై స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడని పోలీసుల విచారణలో తేలింది.
ఇది కూాడా చదవండి: మేం ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాం.. మా జీవితాలను నాశనం చేయోద్దు!
ఇక ఇదే కాకుండా ఏజెన్సీ నుంచి హాష్ ఆయిల్ తీసుకువచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. లక్ష రూపాయలకు లీటర్ హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్ రూ.8 లక్షలకు అమ్మేవాడు. ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించాడు. ఇక గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విద్యార్థులకు సరఫరా చేయడంలో నంబర్ వన్ అని నార్కోటిక్ వింగ్ పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.