సమాజంలో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. డ్రైవర్ కనిపించడం లేదంటూ యజమాని ఏకంగా పోస్టర్లు అంటించింది. అసలు స్టోరీ ఏంటంటే?
ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చేసే వింత పనులను ఫొటోలు, వీడియోల రూపంలో తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక క్షణాల్లో అవి వైరల్ గా మారుతాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఓ డ్రైవర్ సెలవుల నిమిత్తం ఇంటికి వెళ్లాడు. అతడు ఇంటికి వెళ్లాడో లేదో డ్రైవర్ కనిపించడంలో లేదంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ డ్రైవర్ ఇదేంటంటూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు విషయం ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బుబ్లీహిల్స్ లో రామకృష్ణ అనే వ్యక్తి నళిని అనే మహిళ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజూ ఆమె ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఇటీవల రామకృష్ణ బంధువుల్లో ఒకరు చనిపోయారు. దీంతో ఆ డ్రైవర్ యజమాని నళిని వద్ద కొన్ని రోజులు సెలవులు తీసుకుని ఇంటికి వెళ్లాడు. కాగా డ్రైవర్ సెలవులపై వెళ్లడంతో అది నళినికి నచ్చలేదు. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే నళిని తన అల్లుడి ద్వారా డ్రైవర్ రామకృష్ణ కనిపించడం లేదన్నట్లుగా అతడి ఫోన్ నెంబర్లతో పోస్టర్లు ముద్రించింది. అవే పోస్టర్లను బుబ్లీహిల్స్ పరిధిలోని చాలా ఆటోలకు అంటించింది. ఈ పోస్టర్లను చూసిన రామకృష్ణ బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వెంటనే అదే పోస్టర్లను ఫొటో తీసి రామకృష్ణకు పంపించారు. అవి చూసిన డ్రైవర్ రామకృష్ణ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. సెలవులపై ఇంటికి వెళ్లడం నచ్చకే మా యజమాని ఇలా పోస్టర్లు అంటించిందని వాపోయాడు. అనంతరం రామకృష్ణ వెంటనే బుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు మా యజమాని నుంచి ప్రాణహాని ఉందని, గతంలో నా కాలు విరిగిన బలవంతంగా అక్కడే ఉండాలని వేధించేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే కాకుండా తాజాగా నేను కనిపించడం లేదంటూ పోస్టర్లు అతికించిందని బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించిన యజమాని తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.