నేటికాలంలో రోజు రోజుకు ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కొందరు యువకులు ప్రేమ పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని ఆడపిల్లల వెంటపడి వేధిస్తున్నారు. అంతేకాక తమ ప్రేమను కాదంటే హత్యలకు కూడా వెనకాడడం లేదు. ప్రేమించి మోసం చేసిందని కొందరు, ప్రేమించాలని మరికొందరు ఆడపిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాగే రెచ్చిపోయిన ఇద్దరి యువకుల వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థిని బలైంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దుర్మార్గులు యువతిని ఎలా వేధించారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలుకు చెందిన బొప్పిశెట్టి సుజాత, నర్సింహారావు దంపతులుకు సాయికీర్తి(19) అనే కుమార్తె ఉంది. ఆ యువతి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ కాలేజిలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇదే సమయంలో పాల్వంచకు చెందిన రోహిత్ అనే ఆటో డ్రైవర్ ఆ యువతిని ప్రేమిస్తున్నాడు. అంతేకాక కొంతకాలం నుంచి ప్రేమించాలంటూ యువతిని కూడా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక సాయికీర్తి..తల్లిదండ్రులకు యువకుడి వేధింపుల విషయం తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు.. కీర్తిని కొంతకాలం ఖమ్మంలోని వసతి గృహంలో ఉంచి చదివించారు. అక్కడ తరణ్ అనే మరో యువకుడు ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు.
దీంతో మరోసారి సాయికీర్తిని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజరలోని అమ్మమ్మ ఇంటికి పంపారు. ఇక అక్కడి నుంచి సాయికీర్తి రోజూ బస్సు లేదా ఆటోల్లో కాలేజికి వెళ్లి వస్తుండేది. అయినా కూడా ఆ రోహిత్, తరుణ్ లు సాయికీర్తిపై వేధింపులు కొనసాగించారు. ఆ యువకులు ఇద్దరు శృతిమించి ప్రవర్తించారు. ఆ యువతి ఫోన్ కు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోటోలు పంపిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవారు. ఇక తల్లిదండ్రులకు చెప్పిన కూడా ఆ యువకులు వేధిస్తూ ఉండటంతో మానసికి వేదనకు గురైంది. ఈ క్రమంలో ఈనెల 24న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుంది. అయితే వెంటనే గమనించిన యువతి అమ్మమ్మ స్థానికుల సాయంతో కిందకు దించింది. అయితే అప్పటికే సాయికీర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో చేర్చారు. బాధితురాలి పరిస్థితి విషమించిందని నిమ్స్ వైద్యులు చెప్పడంతో తిరిగి ఖమ్మం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యువతి మృతి చెందింది. మృతురాలి బాబాయి ఫిర్యాదు మేరక ఆ ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు డోర్నకల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. మరి.. ఇలా ఆకతాయిల వేధింపులుకు ఎందరో బంగారు తల్లులు బలవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.