జమ్మూ కాశ్మీర్ లో పని చేస్తున్న సైనికుడు సెలవు కారణంగా ఇంటికి రావడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడం కోసమని చెరువు దగ్గరకు ఆ సైనికుడు వెళ్లారు. అయితే స్థానిక కౌన్సిలర్ సైనికుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తన అనుచరులను వెంటబెట్టుకుని సైనికుడిపై మూకదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ సైనికుడు మృతి చెందారు.
జై జవాన్, జై కిసాన్ అని అంటాము. అక్కడ వ్యవసాయ పొలంలో మూడు పూటలా మన కడుపు నింపడం కోసం 365 రోజులూ అలుపెరగకుండా పని చేసే రైతుని.. 365 రోజులూ మన కోసం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడిని గౌరవించడం భారతీయులుగా మన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే మనిషిగా ఓడినట్టే. ఒక సైనికుడు రాక రాక సెలవుల మీద ఇంటికి వచ్చారు. తన బట్టలను తానే ఉతుక్కుందామని చెరువు దగ్గరకు వెళ్తే.. స్థానిక కౌన్సిలర్ కి కోపం వచ్చింది. అంతే సైనికుడిపై దాడికి పాల్పడ్డాడు. కౌన్సిలర్ ముందే అనుచరులు ఆ సైనికుడి మీద దాడి చేశారు. పాపం ఆ సైనికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా.. పోచంపల్లి ప్రాంతానికి చెందిన ప్రభు (29) జమ్మూకాశ్మీర్ లో సైనికుడిగా పని చేసేవారు. సెలవులపై ఇటీవల ఇంటికి వచ్చారు. ఫిబ్రవరి 8న బట్టలు ఉతుక్కోవడానికి సమీప చెరువు వద్దకు వెళ్లారు. అయితే బట్టలు ఉతికే విషయంలో స్థానిక డీఎంకే పార్టీ కౌన్సిలర్ చిన్నసామితో వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం ముదరడంతో సైనికుడిపై దాడి చేసే స్థాయికి వెళ్ళింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ తన అనుచరులను వెంటబెట్టుకుని ప్రభు ఇంటికి వెళ్ళాడు. బయటకు రమ్మని చెప్పి.. సైనికుడి మీద దాడి చేశారు. ఆపండి అన్నందుకు సైనికుడి సోదరుడు ప్రభాకరన్ పై కూడా దాడి చేశారు. ఈ దాడిలో సైనికుడు తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు ప్రభుని ఆసుపత్రికి తరలించారు.
అయితే దురదృష్టవశాత్తు బుధవారం నాడు సైనికుడు ప్రభు కన్నుమూశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలర్ తో పాటు దాడికి పాల్పడ్డ మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రభుపై దాడి చేసిన వారిలో కొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సొంత రాష్ట్రంలో ఇంటి దగ్గర కూడా సైనికులకు రక్షణ లేకపోతే ఎలా అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేశారు. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం ఎంకే స్టాలిన్ ఉదాసీనతను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. మరి సైనికుడి చావుకు కారణమైన రాజకీయ నేతపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.