ఆ మహిళ భర్త నుంచి విడిపోయింది. ఆమె ఉండే ప్రాంతంలోనే ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. అయితే జ్యోతిష్యుడికి మహిళల మీద వ్యామోహం ఎక్కువ. తన దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ కూడా ఇతని ట్రాప్ లో పడింది. అయితే ట్రాప్ లో పడేసిన జ్యోతిష్యుడికే ఆమె మ్యాప్ వేసి షాక్ ఇచ్చింది.
తమిళనాడులోని నమక్కల్ జిల్లా సెందమంగళం సమీపంలోని కొండమనాయక్ కన్పట్టి వెస్ట్ రోడ్డుకు చెందిన సుందర్ రాజన్ (60) జ్యోతిష్యుడిగా ఉంటూ తన దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చే మహిళలను ట్రాప్ చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన దగ్గరకి జ్యోతిష్యం కోసం వెళ్లేవారిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులే ఎక్కువ. ఇలాంటి వారిని టార్గెట్ చేసి వలలో పడేసి వారితో వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. ఈ మహిళల్లో భర్త నుంచి విడిపోయి విడిగా జీవిస్తున్న పరమేశ్వరి (48) ఒకరు. ఈమె జ్యోతిష్యం కోసం సుందర్ రాజన్ దగ్గరకు తరచూ వచ్చేది. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏకాంతంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.
ఈ విషయం సుందర్ రాజన్ భార్య బేబీకి తెలిసి పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ సుందర్ రాజన్ మారలేదు. దీంతో ఆమె భర్త, కొడుకులను వదిలి వెళ్ళిపోయింది. కట్ చేస్తే సందర్ రాజన్ కడుపులోంచి పేగులు బయటకు వచ్చి చనిపోయి ఉన్నాడు. గమనించిన స్థానికులు ఎవరో దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరమేశ్వరిని విచారించగా ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పరమేశ్వరి అడిగిందని సుందర్ రాజన్ తన ఇంటికి ఆమెకు రాసిచ్చాడని.. అయితే సుందర్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని పరమేశ్వరి వెల్లడించింది.
ఆమెకు ఎక్కడ డబ్బు, ఇళ్ళు ఇచ్చేస్తాడో అని భయంతో.. రెండు ఇళ్ళు, డబ్బు తనకు ఇమ్మని అడిగానని.. దీంతో మా మధ్య తరచూ గొడవలు అయ్యేవని ఆమె తెలిపింది. అందుకే సుందర్ రాజన్ ను చంపేందుకు పథకం వేశానని, ప్రియుడితో కలిసి ఆదివారం రాత్రి అతని ఇంటికి వెళ్లి హత్య చేశామని పరమేశ్వరి విచారణలో వెల్లడించింది. తాను, ప్రియుడు కలిసి సుందర్ రాజన్ ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. పరారీలో ఉన్న పరమేశ్వరి ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుందర్ రాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సెందమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.