Crime News: ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువయి పోయాయి. అక్రమ సంబంధాల కారణంగా జరిగే నేరాలు కూడా పెరిగిపోయాయి. ప్రాణాలు తీయటమో.. తీసుకోవటమో సర్వసాధారణం అయింది. తాజాగా, భార్య మరో వ్యక్తితో కలిసి ఉండగా చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. భార్యతో గొడపడ్డాడు. ఆ గొడవ కారణంగా చివరకు తీవ్ర మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సెంతు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నిశ్రా పోలీస్ స్టేషన్‌లో వంట మనిషిగా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న అవినాష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరచుగా కలిసేవారు. కొద్దిరోజుల క్రితం ఏఎస్‌ఐతో భార్య ఏకాంతంగా గుడుపుతూ ఉండగా సెంతు చూశాడు. దీనిపై భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఈ గొడవ విషయాన్ని ప్రియుడితో చెప్పింది. దీంతో సదరు ఏఎస్‌ఐ సెంతును బాగా కొట్టాడు. భార్యతో సంబంధం పెట్టుకోవటమే కాకుండా.. తనపై దాడి చేయటంతో సెంతు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సెంతు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెంతు తల్లి మాట్లాడుతూ.. సెంతుకు తన కోడలికి 7 సంవత్సరాల క్రితం పెళ్లయిందని తెలిపింది.
పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న అవినాష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయంలో భార్యా భర్తలకు గొడవలు కూడా అవుతున్నాయని పేర్కొంది. ఈ గొడవల గురించి సెంతు భార్య అవినాష్‌కు చెప్పిందని.. అవినాష్, సెంతును బాగా కొట్టాడని ఆరోపించింది. ఆ అవమానం భరించలేకే తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తుపాకీతో తల్లిని కాల్చి చంపిన మూడేళ్ల కూతురు!