Crime News: నుదుట కుంకుమ పెట్టుకుంటే చంపేస్తానంటూ ఓ లేడీ ప్రొఫెసర్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడో పోలీస్. ఈ విషయమై ఆమెను టార్చర్ పెట్టాడు. దీంతో భయపడిపోయిన ఆమె పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. తన గోడును వారికి విన్నవించుకుంది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగ్లాదేశ్‌లోని డాఖాకు చెందిన లతా సుమధార్.. అక్కడి తేజ్‌గావ్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. శనివారం కాలేజ్‌కు వెళుతున్న సమయంలో మార్గం మధ్యలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆమెను ఆపాడు.
నుదుట ఉన్న కుంకుమ బొట్టు విషయంలో బూతులు మాట్లాడాడు. ఆమె ఎదురు తిరగటంతో.. ‘నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుంటే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు! బైకుతో ఆమెను ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె పక్కకు జరిగి ప్రమాదం నుంచి తప్పించుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసింది. అతడి పేరు తనకు గుర్తులేదని ఫిర్యాదులో పేర్కొంది. అతడి బైక్ నెంబర్‌ను పోలీసులకు ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ముఖ్యమంత్రి ప్రధాన పూజారిగా ఉన్న గుడి వద్ద అలజడి..