Designer Prathyusha: ప్రముఖ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నొప్పి తెలియకుండా చావటం ఎలా అన్నది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పది రోజుల ముందే ప్రత్యూష తన చావుకు అన్ని రకాలుగా సిద్ధం అయినట్లు సమాచారం. ఇంటి వద్ద అయితే కుటుంబసభ్యులు ఉంటారనే ఉద్ధేశ్యంతో బోటిక్‌లో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బోటిక్‌లోని స్నానాల గదిలోంచి గాలి బయటకు పోకుండా ఉండేందుకు అక్కడి అన్ని కిటికీలు, ఎగ్జాస్టర్ ఫ్యాన్‌లు మూసేయించారని సమాచారం. ఆ తర్వాత ఆ గదిలో కార్బన్ మోనాక్సైడ్‌ను నింపుకుని, దాన్ని పీల్చి ఊపిరి వదిలారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బోటిక్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్న ప్రత్యూష రాత్రి అయినా ఇంటికి వెళ్లలేదు.
రాత్రి 12 గంటల సమయంలో ప్రత్యూష తండ్రి, డ్రైవర్ అక్కడకు రావటంతో విషయం వెలుగుచూసింది. కాగా, దేశంలో టాప్ టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన ప్రత్యూష హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసముంటున్నారు. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రేయ, నిక్కీ గల్రాని, కృతికర్బంధ, ప్రణీత సహా అనేక మంది హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న తన బోటిక్ బాత్రూంలో సూసైడ్ కి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ప్రత్యూష గదినుంచి ఓ సూసైడ్ నోట్, బాత్రూంలోనుంచి కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌ను ఆమే రాసినట్లుగా గుర్తించారు. గత కొద్ది నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న ఆమె.. బయటపడే మార్గం కనిపించకపోవటంతోనే ఆత్మహత్మకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను ఆమె ఎక్కడినుంచి కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మరి, ప్రత్యూష ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్! విచారణలో కీలక విషయాలు..