బాలికలపై అత్యాచార దాడులు రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా అవేవి లెక్క చేయకుండా దుర్మార్గులు దారుణాలకు తెగబడుడున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీ నడిఒడ్డున చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సమయ్‌పూర్‌బద్లీ ప్రాంతంలో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తోంది. 14 ఏళ్ల పెద్దమ్మాయి మతిస్థిమితం లేకుండా ఉంది. ఇక రెండో పాప ఆరు నెలల కిందటే పుట్టింది.
ఇద్దరు బిడ్డలనూ ఇంట్లోనే ఉంచి తల్లి రోజూ పనికి వెళ్లేది. ఇక శుక్రవారం కూడా అలాగే వెళ్లిన తల్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లో చూస్తే పిల్లలు లేరు, దీంతో కంగారుపడి చుట్టుపక్కల అంతటా వెతికింది. పొరుగింట్లో నుంచి పిలల ఏడుపు వినిపించడంతో అనుమానంగా అక్కడికి వెళ్లి తలుపులు తోసింది. తన ఇద్దరు కూతుళ్లపై ఇద్దరు మృగాళ్లు పైశాచికానికి పాల్పడుతోన్న దృశ్యం చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది.
ఇది కూడా చదవండి: Uttarakhand: భూతాల పేరుతో బాబా దారుణం.. 19ఏళ్లుగా మహిళపై అత్యాచారం!
ఇక తల్లి కంట పడగానే ఆ దుర్మార్గులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమల్ మల్హోత్రా పట్టుకోగా రెండో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.