ఐఫోన్ అంటేఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లక్షలు ఖర్చు చేసి ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్టులు కొంటున్నారు. అందుకే ఆ ఫోన్లకు డిమాండ్ మాత్రమే కాదు.. చోరీకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ చోరీ జరిగనా కూడాఒకటి, రెండు ఫోన్లు జరుగుతాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒకేసారి 10 యాపిల్ ఐఫోన్లు పోయాయి.
ఐఫోన్ సొంతం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఐఫోన్ ని, యాపిల్ ఉత్పత్తులను ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లా మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్ లా భావిస్తున్నారు. అందుకే వాటిని నానాటికీ క్రేజ్, డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్టులు చోరీకి కూడా గురవుతున్నాయి. అయితే దొంగలు వీటిని కొట్టేస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, వీటిని డెలివరీ చేయాల్సిన ఒక ఏజెంట్ 10 ఐఫోన్లు కొట్టేయడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. పైగా ఆ డెలివరీ ఏజెంట్ వాటిని కొట్టేసిన తీరు నెటిజన్స్ ని ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చేనే కంచె మేస్తే అనే సామెత అందరూ వినే ఉంటారు. ఇది కూడా అలాంటి కోవకు చెందిన ఘటనే. కస్టమర్లకు ఐఫోన్లు డెలివరీ చేయాల్సిన డెలివరీ ఏజెంటే వాటిని కొట్టేశాడు. 10 ఐఫోన్లు ఒక ఎయిర్ పోడ్స్ ని చాకచక్యంగా దొంగిలించాడు. ఈ ఘటన గురుగ్రామ్ లో జరిగింది. ఒక ఇ-కామర్స్ కంపెనీకి చెందిన డెలివరీ ఏజెంట్ 10 ఐఫోన్లను దొంగిలించినట్లు మ్యాట్రిక్స్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అనే డెలివరీ సంస్థకు చెందిన స్టేషన్ ఇన్ ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 27న తమ వద్ద పనిచేసే లలిత్ అనే డెలివరీ ఏజెంట్ తమకు చెందిన 10 ఐఫోన్లను దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారు. లలిత్ పై ఐపీఎస్ సెక్షన్ 420, 408 కింద కేసు నమోదు చేశారు.
అసలు లలిత్ ఏం చేశాడంటే.. డెలివరీ చేసేందుకు 10 ఐఫోన్లు, ఒక ఎయిర్ పాడ్స్ ని తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత అతని సోదరుడుకి ఇచ్చి ఇవి డెలివరీ చేసేందుకు కస్టమర్స్ ని రీచ్ కాంటాక్ట్ చేయలకపోతున్నాను అంటూ తిరిగి పంపేశాడు. అయితే లలిత్ అలా చేయడం డెలివరీ సంస్థకు అనుమానాలను కలిగించింది. ఆ పార్శిల్స్ ని పరిశీలించగా.. వారి అనుమానం బలపడింది. ఎందుకంటే పార్శిల్ బ్రేక్ చేసినట్లు కనిపిచింది. అనుమానంతో పార్శిల్స్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అసలు ఐఫోన్లు బదులు రెప్లికాలు(ఫేక్) ఉన్నాయి. అది చూసి అవాక్కైన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.