శ్రద్ధా వాకర్ దారుణ హత్యోదంతం.. దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నమ్మి వచ్చిన యువతిని.. అత్యంత పాశవీకంగా హతమర్చాడు ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. దారుణంగా హత్య చేశాడు. పైగా ఆమె మృతదేహాన్ని.. 36 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసి.. సుమారు 18 రోజుల పాటు.. శ్రద్ధా శరీర భాగాలను.. పడేసి వచ్చాడు. అసలు అమీన్.. శ్రద్ధాను హత్య చేసిన తీరు చూస్తే.. వాడెంత సైకోనే క్లియర్‌గా అర్థం అవుతుంది. ప్రేమించినందుకు అతడితో బతికేందుకు తల్లిదండ్రులను కాదనుకుని మరీ బయటకు వచ్చేసింది. కానీ ఆ తర్వాత ఆమీన్‌లోని నరరూప రాక్షసుడి గురించి శ్రద్ధాకు తెలిసింది.
కానీ అప్పటికే ఆమె ఆ నరకం నుంచి బయటపడలేని విధంగా దానిలో చిక్కుకుపోయి.. చివరకు ప్రాణాలే కోల్పోయింది. ఈ దారుణ సంఘటనను మరువక ముందే.. ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. మాజీ ప్రేయసిని హత్య చేసి ముక్కలుగా నరికి ఓ బావిలో పడేశాడు నిందితుడు. ఈ దారుణ సంఘటన వివరాలు..
ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నవంబరు 15న యూపీ, అజంగఢ్‌లోని పశ్చిమి గ్రామ శివారులోని ఓ బావిలో యువతి మృతదేహం నీటిపైకి తేలింది. ఇది గమనించిన వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి అర్ధనగ్న శరీరంతో పాటు ఆరు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. బావికి సమీపంలో యువతి తల దొరికింది. ఈ భయానక సంఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో మృతురాలి పేరు ఆరాధనగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాధన.. అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతడిని కాదని మరో యువకుడిని వివాహం చేసుకుంది. దాంతో ఆరాధన మీద పగ పెంచుకున్న ప్రిన్స్ యాదవ్.. ఎలాగైనా సరే ఆమెను అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన బంధువులు, స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు.
దాని ప్రకారం నవంబర్ 9న ఆరాధనకు కాల్ చేశాడు ప్రిన్స్ యాదవ్. గుడికి వెళ్దామని చెప్పి.. బైక్ మీద ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఊరి బయట చెరకు తోట సమీపంలోకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి ఆరాధనను హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా నరికి.. పాలిథిన్ సంచిలో వేసి.. కొంత దూరంలో ఉన్న బావిలో పడేశాడు. నవంబర్ 15న ఆరాధన మృతదేహాన్ని గుర్తించడంతో.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కాల్ లిస్ట్ ఆధారంగా.. ప్రిన్స్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేందుకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన యాదవ్.. అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న నాటు తుపాకీతో పోలీసులు మీద కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు.. ప్రిన్స్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్ గాయమైంది. ఈ కేసులో పదునైన ఆయుధ, నాటు తుపాకీ, క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలానే ప్రిన్స్ యాదవ్‌తో పాటు అతడికి సహకరించిన స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.