సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం విమానంలో ఓ వ్యాపారి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యం మత్తులో అతడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మరువక ముందే మరో వికృత చేష్ట వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి బస్సులో దారుణంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్టును ముందున్న యువతికి చూపిస్తూ ఇబ్బంది పెట్టాడు. బస్ సిబ్బంది అతడ్ని పట్టుకోవటంతో చిన్నపిల్లాడిలా ఏడవటం మొదలుపెట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యుతి డీటీసీ బస్‌లో ప్రయాణిస్తోంది.
అదే బస్సులో జాకిర్ అనే వ్యక్తి కూడా ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో బస్సులో ఎక్కువ మంది జనం లేరు. కొంతదూరం వెళ్లగానే జాకిర్ వికృత చేష్టలకు తెరతీశాడు. తన జిప్ తీసి ప్రైవేట్ పార్టును బయటపెట్టాడు. తర్వాత దాన్ని ముందున్న యువతికి చూపించసాగాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ తింది. గట్టిగా కేకలు పెట్టింది. ఆమె కేకలు పెట్టగానే అతడు తన ప్రైవేట్ పార్టును లోపల పెట్టేసుకున్నాడు. ఆమె అరుపులు విన్న బస్సు డ్రైవర్ బస్సు ఆపాడు. సిబ్బంది ఆమె దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. ఆమె జరిగిందంతా వారికి చెప్పింది. వారు అతడ్ని పట్టుకుని నాలుగు వేశారు.
దీంతో జాకిర్ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పసాగాడు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో ఉంచాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అతడు చేసిన దాన్ని తప్పుబడుతున్నారు. అయితే, ఇలాంటి సంఘటన ఇదే మొదటి సారి కాదు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ వ్యక్తి ఏకంగా గుడిలో తన ప్రైవేట్ పార్టును మహిళకు చూపించి ఇబ్బంది పెట్టాడు. మరి, బస్సులో యువతికి తన ప్రైవేట్ పార్టు చూపి వికృతంగా వ్యవహరించిన జాకిర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Breaking News: A man named Zakir caught by DTC Bus Marshal, Delhi, while he was flashing his private part to a woman passenger. pic.twitter.com/JTWtamO313
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 4, 2023