పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకొని ఒక్క ఏడాదిలోనే కొంతమంది వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నారు. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తల మద్య విభేదాలు రావడంతో విడిపోతున్నారు.. ఈ క్రమంలోనే అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. మరికొంత మంది దారుణంగా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఢిల్లీలో ఓ వ్యక్తి బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు ఏళ్లుగా భార్యాభర్తల మద్య గొడవలు రావడంతో ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేరు వేరుగా ఉంటున్నారు. భర్తకు తెలియకుండా ప్రియుడితో ఇంట్లో నగలు, డబ్బుతో ఉడాయించింది. ఆమెపై కేసు పెడితే అత్తామామలు ఏకంతంగా గడిపిన వీడియో బయటపెడతానని బెదిరించింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన నగల వ్యాపారికి కొంత కాలంగా తన భార్యతో గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా వారిద్దరు మాత్రం కలిసేది లేదని ఒకే ఇంట్లో వేరు వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త గమనించాడు. ఈ విషయంలో భార్యను గట్టిగా మందలించడంతో భార్య తన గుట్టు బయటపడిందని గ్రహించి ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. అన్నీ పక్కాగా ప్లాన్ వేసుకొని ప్రియుడితో పారిపోయేందుకు సిద్దమైంది.
తన ప్రియుడితో వెళ్లే సమయంలో ఇంట్లో కోటి రూపాయలకు పైగా విలువ చేసే బంగారు నగలు, నగదు తీసుకొని ఉడాయించింది. తన భార్య ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. దాంతో పాటు నగలు, డబ్బు కూడా తీసుకు వెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. తనను పోలీసులు వెతుకుతున్నారని.. తనపై కేసు నమోదు అయినట్లు తెలుసుకున్న భార్య తన వద్ద అత్తమామలకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో ఉందని.. కేసు వాపసు తీసుకోకుంటే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భర్తను బెదిరించింది.
ఈ విషయంపై మరోసారి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాడు ఆమె భర్త. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అత్తమామలు ఉంటున్న రూమ్ లో చెక్ చేయగా అప్పటికే సీక్రెట్ గా కెమెరాలు, రికార్డర్లు అమర్చి ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితురాలి కోసం గాలిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.